తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాల్టీ షోలకు శ్రీకారం చుట్టారు యాంకర్, దర్శకులు ఓంకార్. బుల్లితెర రియాల్టీ షోలలోనే తనదైన శైలి నాటకీయతను తీసుకొచ్చి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఓంకార్. బుల్లితెరపై సక్సెస్ అయిన తర్వాత  హవీష్ హీరోగా జీనియస్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.  కాకపోతే ఈ చిత్రం అనుకున్న విజయం సాధించలేదు..దీంతో హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో ‘రాజుగారి గది’ తెరకెక్కించాడు. 
Related image
ఈ చిత్రం అనుకున్న దానికన్నా రెట్టింపు విజయం సాధించింది.  ఇక ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓంకార్..అక్కినేని నాగార్జున కథానాయకుడిగా పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ మరియు ఓ.ఎ.కె ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న   “రాజు గారి గది 2” చిత్రంతో మరోసారి అభిమానుల ముందుకు వస్తున్నారు. 
Image result for ఓంకార్ సినిమా
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  ఈ ట్రైలర్ విశేష స్పందన రావడం తో చిత్ర యూనిట్ అంత హ్యాపీ గా ఫీల్ అయ్యారు.

నాగార్జున ఈ చిత్రంలో మెంటలిస్ట్ గా కనిపించనుండగా.. సమంత ఆత్మ గా కనిపించబోతుంది. ఇక ఈ మూవీ ని దీపావళి కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్, నరేష్, అశ్విన్, వెన్నెల కిషోర్ లు కీలకపాత్రలు పోషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: