పవర్ స్టార్ తో సినిమా చేయాలంటే వారు అనుకుంటే కాదు పవన్ ఫిక్స్ అవ్వాల్సిందే. ఆయన్ను మెప్పించే కథతో వచ్చినా ఆ నిమిషం అతనికున్న మైండ్ సెట్ తోనే సినిమాలను ఎంచుకుంటాడు పవన్ కళ్యాణ్ ఆ క్రమంలోనే పూరి చెప్పిన పోకిరి, త్రివిక్రం చెప్పిన అతడు కథలను మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రం సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తన తర్వాత సినిమా ఎవరితో ఉంటుంది అన్నది క్లారిటీ లేదు.


అసలైతే సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో తమిళ రీమేక్ సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి కాని అదేది ముందుకు కదల్లేదు. ఇక పవర్ స్టార్ తో సినిమా తీసేందుకు దర్శకులు క్యూలో ఉన్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ తో మరో సినిమా చేస్తా అంటున్నాడు గబ్బర్ సింగ్ డైరక్టర్ హరిష్ శంకర్. ఈ ఇయర్ అల్లు అర్జున్ తో డిజె హిట్ అందుకున్న హరిశ్ శంకర్ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ మీద అభిమానం చూపించాడు.


గబ్బర్ సింగ్ హిట్ అయ్యింది అంటే దానిలో పవన్ ఇన్వాల్వ్ మెంట్ ఎంత ఉన్నా హరిష్ శంకర్ క్రియేటివిటీ అందరికి తెలిసిందే. పవన్ ప్రేమించే వ్యక్తిగా హరిష్ శంకర్ పవర్ స్టార్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఓ కథ సిద్ధం చేశాడట. పవన్ కు కలవడం ఆయనతో ఓకే చేయించుకోవడమే మిగిలాయట.


ప్రస్తుతం పవన్ 2019 ఎన్నికలలోపు మరో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ టైంలో ఎవరు ఫుల్ స్క్రిప్ట్ పర్ఫెక్ట్ షెడ్యూల్ వేసుకుని వస్తారో వారికే ఛాన్స్ ఇస్తాడట. హరిష్ శంకర్ ఎలాగు అదే దారిలో ఉన్నాడు కాబట్టి ఈ శిష్యుడికి పవన్ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని విషయాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: