జై లవకుశ మూవీ హిట్ కొట్టడంతో ఇప్పుడు యంగ్ టైగర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటా అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించే టాక్ బయటకొచ్చింది. మాటల మాంత్రికుడితో తారక్ న్యూ మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాలో రోబోబ్యూటీ.. జూనియర్ తో స్టెప్పులేయబోతుందని సమాచారం..

Image result for NTR TRIVIKRAM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ యంగ్ టైగర్ కోసం మెగా ఫోన్ పట్టుకునేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. అలాగే తారక్ 'జై లవకుశ' తరువాత  ఫ్యామిలీతో కలసి లాంగ్ హాలిడే ట్రిప్ ను ప్లాన్ చేసుకున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి..

Image result for NTR TRIVIKRAM

ఇప్పటికే తారక్ తో చేయబోయే మూవీ స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసాడట త్రివిక్రమ్. టాలీవుడ్ టాక్ ప్రకారం ఈ మూవీలో తారక్ మిలటరీ అఫీసర్ గా కనిపించనున్నాడట. అలాగే రోబో బ్యూటీ అమీ జాక్సన్ ఈ మూవీలో తారక్ తో జోడీ కట్టబోతోందట. త్రివిక్రమ్ స్టైల్ ఎక్కడా మిస్ కాకుండా ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ ఫిల్మ్ తెరకెక్కనున్నట్లు టాక్..

Image result for AMY JACKSON

నిజానికి తారక్ సినిమాని త్రివిక్రమ్ ఎప్పుడో సెట్స్ పైకి తిసుకెళ్లాల్సింది.. కానీ రకరకాల కారణల వల్ల ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టు డిలే అయింది. అందుకే వీలైనంత వేగంగా ఈ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాడు త్రివిక్రమ్.. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హీరోయిన్ గా అమీ జాక్సన్ అంటేనే ఎన్టీఆర్ అభిమానులు భయపడిపోతున్నారు. అమీజాక్సన్ కు ఇప్పటివరకు సరైన హిట్ లేకపోవడమే. అందునా అన్నీ డిజాస్టర్లే. ఇలాంటి టైంలో తారక్ తో జోడి కడితే తేడా కొట్టే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

Image result for NTR

తారక్ -త్రివిక్రమ్ కొత్త మూవీ జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. హీరోయిన్స్ లో అమీ పేరు వినిపిస్తున్నా.. యంగ్ టైగర్ ఈ ఇంగ్లీష్ భామని ఫైనల్ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే. ఇక త్రివిక్రమ్ - పవన్ కామినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ రిజల్ట్ తో ఈ సినిమా పై అంచనాలు పెరిగే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: