తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోల హవా నడుస్తుంది. ఇప్పటికే నాని, శర్వానంద్, రాజ్ తరుణ్, నిఖిల్, దేవరకొండ విజయ్ మినిమమ్ గ్యారెంటీ హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.  చిన్న బడ్జెట్ తో వస్తున్న ఈ హీరోల సినిమాలు భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తూ బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.  ఈ సంవత్సరం శతమానం భవతి చిత్రంతో మంచి విజయం అందుకున్న శర్వానంద్ తాజాగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘మహానుభావుడు’ రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. 
Image result for mahanubhavudu
దసరా సందర్భంగా శర్వానంద్- మెహరీన్ జంటగా వచ్చిన మూవీ మహానుభావుడు విజయం సాధించడంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి.  వాస్తవానికి దసరా కానుకగా పెద్ద హీరోలు ఎన్టీఆర్ జై లవకుశ, మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలకు పోటీగా నిలిచి ‘మహానుభావుడు’ మంచి హిట్ సాధించింది.  తక్కువ థియేటర్లలో రిలీజైన మహానుభావుడు.. రోజురోజుకూ థియేటర్ల సంఖ్యను పెంచేసుకుంది.
Image result for mahanubhavudu
వసూళ్లు కూడా ఓ రేంజ్‌లోనే రాబట్టింది. సెప్టెంబర్ 29 న రిలీజ్ ఆయిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 27 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది. ఆరు రోజుల్లోనే రూ. 14 కోట్ల షేర్ ను అందించింది. ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయానికొస్తే 32.2 కోట్ల రాబట్టినట్టు ట్రేడ్ ఎనలిస్ట్ రమేష్‌బాలా తెలిపాడు. శర్వానంద్ కెరీర్‌లో హైయెస్ట్ వసూలుగా నిలిచింది.
Image result for mahanubhavudu
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో శర్వానంద్‌కి హ్యాట్రిక్ (రన్‌ రాజా‌ రన్, ఎక్స్‌ప్రెస్ రాజా)కావడం గమనార్హం. ఇది ఇలా ఉంటే  ఈ మూవీని మరో వంద థియేటర్లలో రేపటి నుంచి రిలీజ్ చేయనున్నారు.. హైదరాబాద్ లోనే ఈ మూవీని 70 థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: