మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడని తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 150 ఏళ్ల క్రితం జరిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతుంది. దాదాపు సినిమా బడ్జెట్ కూడా 150 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. 


సినిమాలో కేవలం నరసింహారెడ్డి పాత్ర కోసం డిజైన్ చేస్తున్న కాస్టూమ్, చెప్పుల ఖర్చే 5 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. బాలీవుడ్ నుండి ఫ్యాషన్ డిజైనర్స్ ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారు. సినిమాలో కాస్టూమ్స్ కే 5 కోట్ల ఖర్చు అంటే ఇక అవి ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఊహించవచ్చు. 


బాహుబలి తర్వాత అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా తెలుగు పరిశ్రమ నుండి రాబోతున్న ఈ సైరా నరసింహారెడ్డి సినిమాను తెలుగు, తమిళ, హింది భాషల్లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అందుకే బడ్జెట్ లిమిటేషన్స్ కూడా లేకుండా ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. 


అమితాబ్, సుదీప్ లాంటి స్టార్ తో పాటుగా జగపతి బాబు కూడా సైరాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. మరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందా రీ ఎంట్రీతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ సైరాతో ఆ మేనియా కొనసాగిస్తాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: