బుల్లితెర మీద సుడిగాలి సుధీర్, జబర్దస్త్ రష్మిల హంగామా అంతా ఇంతా కాదు. ఇద్దరిని చూస్తే డీప్ లవ్ లో ఉన్న వారు ఎలా మాట్లాడుకుంటారో అలా ఉంటారు. రష్మి ప్రేమను పొందేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు సుధీర్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సీరియస్ మ్యాటర్ నడుస్తుంది అని అనుకోవడం కామనే.


ఇక ఇదే విషయాన్ని రష్మి ఫేస్ బుక్ చాట్ లో అడిగారు. సుధీర్ తో తనకున్నది కేవలం ఆన్స్ స్క్రీన్ కెమిస్ట్రీనే తప్ప ఆఫ్ స్క్రీన్ లేదని. కేవలం ప్రోగ్రాం సక్సెస్ చేయడం కోసమే ఇద్దరం అలా ఉంటాం తప్ప మీరనుకుంటున్నట్టు ఏమి లేదని అన్నాడు. ఓ అభిమాని ఏకంగా సుధీర్ ను పెళ్లిచేసుకుంటారా అన్న ప్రశ్నకు రష్మి ఇచ్చిన సమాధానం ఇది.


యాంకర్ గా చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై తన అందాలతో అదరగొడుతున్న రష్మి సుడిగాలి సుధీర్ తో ఎఫైర్ నడిపిస్తుంది అన్నది ఓపెన్ టాక్. దీనిపై రష్మి క్లియర్ కట్ గా తన మనసులో మాట చెప్పేసింది. కేవలం ఆ ప్రోగ్రాం సక్సెస్ అవడం కోసమే అంటూ చెప్పుకొచ్చింది. జబర్దస్థ్ లో యాంకర్ అయిన రష్మి ఢీ జోడిలో సుధీర్ తో కలిసి టీం లీడర్ గా చ్సింది. ఇక ఇప్పుడు ఢీ 10లో కూడా టీం లీడర్ గా ఉంది.


సుధీర్ తోనే కాదు తను చేసే షోలో ఎవరు తన కో యాంకర్ అయినా అందరితో ఒకే రకమైన క్లోజ్ నెస్ తో ఉంటానని చెబుతుంది రష్మి. ఢీ ప్రోగ్రాంలో ప్రదీప్ తో కూడా తను అదే రకమైన క్లోజ్ నెస్ కొనసాగిస్తున్నా అని సుధీర్ మాత్రమే కాదు అక్కడ ప్రదీప్ కూడా మంచి స్నేహితుడే అంటుంది రష్మి.


మరింత సమాచారం తెలుసుకోండి: