మిల్కీ బ్యూటీ తమన్నా కెరియర్ లో ప్రస్తుతం అవకాశాల కోసం నానా తంటాలు పడుతుంది. సినిమాలో లీడ్ హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో అమ్మడు ఐటం సాంగ్స్ కు సై అనేస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో మిల్కీ బ్యూటీ తమన్నా రెండు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసింది. ఇక అదే ఉత్సాహంతో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జై లవ కుశలో స్వింగ్ జరా సాంగ్ ఆఫర్ అందుకుంది.


తారక్ తో ఐటం అనగానే తమన్నా రేంజ్ మారుతుందని.. ఆ సాంగ్ తన కెరియర్ ను గాడిలో పడేస్తుందని భావించింది. అందుకే స్వింగ్ జరాలో అమ్మడు ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా అందాల ప్రదర్శన చేసింది. అయితే సినిమాలో అనుకున్నంత రేంజ్ లో ఆ సాంగ్ పండలేదు. వెస్ట్రెన్ కల్చర్ లో సాగే ఈ సాంగ్ పై అంచనాలు పెంచగా తమన్నా ఐటం సాంగ్ మాత్రం ఏదో అలా అనిపించింది.


ఈ సాంగ్ తో ఎలాగైనా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్న తమన్నా ఆశలు అడి ఆశలయ్యాయి. సినిమా హిట్ పడినా తమన్నా సాంగ్ గురించి మాత్రం ఎవరు మాట్లాడటం లేదు. జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ రేంజ్ ఊహించినా స్వింగ్ జరా మాత్రం సోసోగానే అనిపించింది. 


ఒక్కటి మాత్రం నిజం తమన్నా ఇదవరకు ఎన్ని ఐటం నెంబర్స్ చేసినా స్వింగ్ జరాలో అమ్మడి హాట్ నెస్ కు అందరు ఫిదా అయ్యారు. పాట హిట్ కాకున్నా సరే తమన్నా అందాలను మాత్రం అభిమానులు ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం క్వీన్ రీమేక్ లో నటిస్తున్న తమన్నా ఆ సినిమాతో అయినా మళ్లీ ఫాంలోకి వస్తుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: