దసరా పండగ కి రెండు పెద్ద సినిమాల నడుమ విడుదల అయిన మహానుభావుడు పరిస్థితి ఏమవుతుందో అనుకున్నారు కానీ రివర్స్ లో మహానుభావుడు హిట్ అయ్యి మిగితా రెండు సినిమాల వసూళ్లు తగ్గిపోయాయి.

మహానుభావుడు సినిమా విషయం లో శర్వానంద్ మళ్ళీ తన గత సంక్రాంతి అనుభవాలు ప్రూవ్ చేసుకున్నాడు. హీరోగా చిరు - బాలయ్య ల మధ్యన అడుగు పెట్టిన శర్వానంద్ శతమానం భవతి తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ - మహేష్ బాబు ల మధ్యన విచ్చేసిన శర్వా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని వసూళ్లు సాధిస్తున్నాడు. మహానుభావుడు కి ఎనిమిది రోజుల ముందర విడుదల అయిన జై లవ కుశ హిట్ అవ్వడం , రెండు రోజుల ముందు వచ్చిన స్పైడర్ మాత్రం ప్లాప్ గా నిలవడం శర్వా సినిమాకి వసూళ్లు పెంచేసాయి.

ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మారుతి సెంటిమెంట్ కి బాగా కనక్ట్ అయ్యారు .  తొలివారంలో ఈ సినిమా 32.2 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు. వసూళ్ల విషయంలో ఈ సినిమా ఇదే జోరును కొనసాగిస్తే 50 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శర్వానంద్ కెరీర్ లోనే ఇప్పటి వరకూ వచ్చిన అతి ఎక్కువ వసూళ్లు గా ఈ సినిమా గురించి చెబుతున్నారు చాలామంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: