ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా సిల్వ స్క్రీన్ పై మెరిసిన యువ హీరో రాజ్ తరుణ్ తన రేంజ్ హిట్ అందుకుంటూ కెరియర్ కొనసాగిస్తున్నాడు. యువ హీరోల్లో జోష్ ఫుల్ సినిమాలను తీస్తూ మంచి ఫలితాలను అందుకుంటున్న రాజ్ తరుణ్ ఈసారి స్టార్స్ కు పోటీగా వచ్చేందుకు సిద్ధమయ్యాడు. పండుగ వచ్చింది అంటే స్టార్ సినిమాల హంగామా ఉండాల్సిందే.


ఇద్దరు పెద్ద స్టార్స్ పండుగ రోజు రిలీజ్ టార్గెట్ చేస్తుంటారు. అయితే రెండేళ్లుగా పండుగలో పోటాలో ఉన్న పెద్ద సినిమాలకు ఏమాత్రం భయపడకుండా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు శర్వానంద్. అఫ్కోర్స్ సినిమాల ఫలితాలు కూడా హిట్ అందుకోవడం విశేషం. స్టార్స్ సినిమాలు అంచనాలు అందుకోకపోవడంతో పక్కనే వచ్చిన శర్వా సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.


లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఎక్స్ ప్రెస్ రాజా, ఈ సంక్రాంతికి శతమాభం భవతి, లేటెస్ట్ గా దసరాకి మహానుభావుడు ఇలా మూడు పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యి శర్వానంద్ కెరియర్ లో బీభత్సమైన హిట్లు అందుకున్నాయి. ఈ క్రమంలో రాజ్ తరుణ్ కూడా తన సినిమాను పండుగకే టార్గెట్ పెట్టాడు. 


ఈసారి సంక్రాంతికి శర్వానంద్ రావట్లేదు కాబట్టి అతని ప్లేస్ లో రాజ్ తరుణ్ రాజుగాడు సినిమా తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. సంజనా రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా స్టార్ సినిమాలకు పోటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది. మరి శర్వానంద్ రూట్ లో కొత్త అడుగు వేస్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాతో హిట్ కొడితే అతను కూడా పండుగ టార్గెట్ తోనే సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: