బిగ్ బాస్ నుండి బయటకు రాగానే పవర్ స్టార్ మీద తన అభిమానుల మీద వీరంగం ఆడేశాడు కత్తి మహేష్. పవన్ ఫ్యాన్స్ చేసిందేమో కాని నిజంగానే తనను ఏదో చేసేస్తారని టివి స్టూడియోల చుట్టూ తిరగడమే సరిపోయింది అతనికి. ఈ వ్యవహారం ఎలాగో సర్ధుమనిగింది అనుకుంటుంటే మొన్నీమధ్యనే తారక్ జై లవ కుశ సినిమా రివ్యూ గురించి అంతే మాట్లాడాడు.


అయితే ఈ విషయం మీద బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ విన్నర్ శివ బాలాజి స్పందించాడు. ఎదుటి వారి గురించి మాట్లాడేప్పుడు అన్ని చూసుకుని మాట్లాడాలని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరని.. అది వాక్ స్వాతంత్రం అంటే మాత్రం తప్పని అన్నాడు. మన మాటలను బట్టే ఎదుటి వారి స్పందన ఉంటుందని.


మనం మాట్లాడిన విధానం బాగుంటే వారు కూడా అదే రకమైన సమాధానం ఇస్తారని.. ముందు మనం మాట్లాడే దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలని అన్నాడు శివ బాలాజి. ఈ కామెంట్స్ కచ్చితంగా కత్తి మహేష్ కు తగులుతాయి. తానేదో పెద్ద క్రిటిక్ అంటూ పవన్ అసలు నటుడే కాదు అంటూ చెప్పిన కత్తి మహేష్ శివ బాలాజి ఇచ్చిన కౌంటర్ కు సౌడ్ ఉండదని చెప్పొచ్చు.


బిగ్ బాస్ హౌజ్ లో కలిసి ఉన్న శివ బాలాజి బయట ఏం జరుగుతుందో ఏం తెలిసేది కాదని.. ఇక షో ద్వారా మాత్రం తమకు అంతా మంచి జరిగిందని అన్నారు. తారక్ తమని రిసీవ్ చేసుకున్న విధానం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు శివ బాలాజి. 



మరింత సమాచారం తెలుసుకోండి: