మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ సినిమా ఈ నెల 18న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో రవితేజ మాటలను సినిమాపై అంచనాలను పెంచాయి. దర్శకుడు అనీల్ రావిపుడి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడని అతను చేసిన దానిలో సగం చేస్తే చాలని అన్నాడు రవితేజ. దర్శకుడిగా ఇప్పటికే రెండు హిట్లు కొట్టిన అనీల్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టేస్తాడని అన్నారు.


సినిమా మొత్తం షూటింగ్ లో ఏ ఆర్టిస్ట్ మీద కోప్పడకుండా తనకేం కావాలో అది తీసుకున్నాడని అన్నారు రవితేజ. తన ఎనర్జీ సూపర్ అని కితాబిచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో 13 ఏళ్ల తర్వాత కలిసి చేయడం జరిగిందని. ఇక హీరోయిన్ మెహెరిన్ మరో రెండు సినిమాలతో తెలుగు నేర్చుకుంటుందని.. ఇక్కడ జెండా పాతేయడానికి ఆమె సిద్ద్ధమైందని అన్నారు.


రాజేంద్ర ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కెరియర్ లో మొదటిసారి రాధిక గారితో కలిసి పనిచేయడం ఆనందం కలిగించిందని అన్నారు. సినిమా దర్శకుడి గురించి మాత్రం అనీల్ ను ఆకాశానికెత్తేశాడు రవితేజ మనం మళ్లీ కలిసి చేస్తూనే ఉండాలని అన్నాడు. రవితేజ లాంటి స్టార్ ను మెప్పించేశాడంటే కచ్చితంగా అనీల్ కు మంచి ఫ్యూచర్ ఉన్నట్టే.


పటాస్, సుప్రీం సినిమాలతో హిట్ అందుకున్న అనీల్ రావిపుడి హ్యాట్రిక్ కోసం రాజా ది గ్రేట్ సినిమా చేశాడు. సినిమా దీవాళికి వచ్చి హిట్ సెంటిమెంట్ కలిసి వస్తుందని అంటున్నారు. రవితేజ చెప్పినట్టుగా అనీల్ టాలెంట్ ఏంటో రాజా ది గ్రేట్ తో ప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: