తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పుకునే వారిలో కొద్ది మందే ఉన్నారు.  ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కాంబినేషన్ అంటే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అనే చెప్పాలి..ఎందుకంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరోసారి త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుంది.  ఈ మూవీ గురించి ఇప్పటివరకూ ఎలాంటి సెట్ కబుర్లు లేకుండా మేనేజ్ చేసిన యూనిట్ ఫైనల్ గా టైటిల్ " అజ్ఞాతవాసి " కే ఫిక్స్ అయ్యారని సమాచారం.
Image result for pawan trivikram new film
కాకపోతే అఫిషియల్ గా పేర్ ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ చేయలేదు. త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ చేస్తున్న 3 వ మూవీ ఇది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ కోసం ఫాన్స్ ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అంతే కాదు  పవన్ అభిమానులు నిరుత్సాహ పడకముందే వారికి శుభవార్త చెప్పారు త్రివిక్రమ్.  పవన్ కళ్యాణ్ న్యూ ఫిల్మ్ ఫస్ట్ లుక్ దీపావళి స్పెషల్ గా వస్తోందని టాక్. 

ఈ మూవీ గురించి ఇప్పటివరకూ ఎలాంటి సెట్ కబుర్లు లేకుండా మేనేజ్ చేసిన యూనిట్ ఫైనల్ గా టైటిల్ " అజ్ఞాతవాసి " కే ఫిక్స్ అయ్యారని సమాచారం. అత్తారింటికి దారేదిలో లాగానే పవన్ ఈ మూవీలో రిచ్ బిజినెస్ మాన్ అయినా బాషా స్టైల్ లో మరో చోట లైఫ్ లీడ్ చేస్తుంటాడని యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగానే ఉన్నాయట.

కీర్తి సురేష్ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా ఖుష్బూ రావు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్న ఈ మూవీకి కొలవెరి ఫేమ్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.రావు రమేష్ రోల్ కు వింతైన ఫ్యామిలీ స్టైల్ ఉంటుందని కూడా వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: