ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది ఆ వెంటనే మెగా పవర్ స్టార్ తో రచ్చ సినిమా తీసి తన సత్తా నిరూపించుకున్నాడు. టాలీవుడ్ లో మాస్ డైరక్టర్స్ లో క్రేజ్ తెచ్చుకున్న దర్శకులలో సంపత్ నంది ఒకరు. మెగా ఫ్యామిలీ ఆరాధ్యుడిగా పేరు తెచ్చుకున్న సంపత్ నంది సర్దార్ గబ్బర్ సింగ్ ఛాన్స్ మిస్ అయ్యాక రవితేజతో బెంగాల్ టైగర్ సినిమా చేశాడు.


ఇక ఈమధ్యనే గోపిచంద్ తో గౌతం నంద సినిమా తీసి పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక ప్రస్తుతం సంపత్ నంది తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. తన ఓన్ ప్రొడక్షన్ సంపత్ నంది క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లోనే సినిమా చేయబోతున్నాడట సంపత్ నంది. ఇక సినిమా టైటిల్ గా సీటీమార్ అని పెట్టబోతున్నారట.


రచ్చ తర్వాత మెగా ఫ్యామిలీతో సత్సంబంధాలు ఏర్పరచుకున్న సంపత్ నంది ప్రతి సినిమాలో మెగా సెంటిమెంట్ ను మాత్రం వదలట్లేదు. గౌతం నంద టైటిల్ కూడా పవన్ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పేరు. అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టాడు. ఇక ఇప్పుడు చేయబోయే సినిమాకు సీటీమార్ అని టైటిల్ పెట్టబోతున్నడట.


ఈమధ్యనే వచ్చిన అల్లు అర్జున్ డిజె సినిమాలో ఓ సాంగ్ సీటీమార్.. ఆ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు సంపత్ నంది. కొత్తవారితో చేయబోతున్న ఈ సినిమా తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. మరి సినిమా సంపత్ నందికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: