ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకుంటే నే సమాజం లో చాలా చోట్ల మనల్ని మనం నెట్టుకుని రాగలం అంటారు పెద్దలు. ఇక సినిమా రంగంలో అయితే ఈ విషయం ప్రత్యేకంగా చెప్పన్నక్కర లేదు. డిప్లమసి అనేది లేకపోతే ఈ ఫీల్డ్ లో ఏ బండీ నడవదు గాక నడవదు. కానీ ఇక్కడ కూడా కాస్త తిక్క మనుషులు ఉంటారు, తిక్క అంటే ఏం లేదు ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం రానివారు లేదా అలాంటి ప్రవర్తన ఇష్టం లేనివారు.

ముఖ్యంగా హీరోయిన్లలో అలాంటి వ్యక్తి తాప్సీ ఆమెకి మొదటి నుంచీ మనసులో ఏది అనుకుంటే అది చెప్పేయడం అలవాటు. ఆ మధ్యన టాలీవుడ్ తీరు ని , రాఘవేంద్ర రావు నీ అతని టేకింగ్ నీ ఎండగట్టేసింది తాప్సీ. ఇప్పుడు బాలీవుడ్ హీరోల మీద ఆమె టార్గెట్ పెట్టినట్టు అనిపిస్తోంది. ”త‌నకు హీరోల‌తో పాటు స‌మాన‌మైన ఇమేజ్ ఉన్నా – బాలీవుడ్‌లో పెద్ద హీరోలెవ్వ‌రూ త‌న‌ని ప‌ట్టించుకోవ‌డం లేదు” అంటూ… గోల పెడుతోంది.

తాప్సీ నటించిన అన్ని సినిమాలూ బాగా ఆడినవే. ఆమె చిత్రం బేబి సూపర్ డూపర్ హిట్ అయ్యింద్, పింక్ సినిమా అయితే ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. జుద్వా 2 మాత్రం యావరేజ్ గా నడుస్తోంది. ఇక బాలీవుడ్ లో ఆమెకి భవిష్యత్తు ఉందా లేదా అనే సందేహం లో కథ నడుస్తోంది.

ఎందుకంటే హీరోల లాగా కాకుండా హీరోయిన్ కి ఒక్క యావరేజ్ లేదా ప్లాప్ పడితే కథ ముగిసిపోతుంది. ఇలాంట‌ప్పుడే కాస్త ఒద్దిక‌గా ఉండి సినిమాలు వ‌చ్చేలా చూసుకోవాలి. కానీ.. తాప్సి మాత్రం రివ‌ర్స్ గేర్‌లో వెళ్తోంది. బాలీవుడ్‌లో హీరో వ‌ర్షిప్‌ని స‌వాల్ చేస్తూ కామెంట్లు విసురుతోంది. ఇలాంటి వ్యాఖ్య‌లు తాప్సి కెరీర్‌కు అంత మంచి చేయ‌వు. పైపెచ్చు అహంకారి అనే ముద్ర వేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: