ఉయ్యాలా జంపాల అనే డెబ్యూ సినిమాతో ఎవ్వరూ ఊహించని సూపర్ హిట్ కొట్టేసిన హీరో రాజ్ తరుణ్ తరవాత కుమారి తో బ్లాక్ బస్టర్ హీరో అయిపోయాడు. ఆ తరవాత మాత్రం అతని కెరీర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. యావరేజ్ లూ ఎబోవ్ యావరేజ్ లూ తప్ప ఎక్కడా భారీ హిట్ సినిమాలు చెయ్యలేక సతమతం అవుతున్నాడు ఈ హీరో.

అయితే ఇతని ఆర్ధిక ప్రణాళిక లు మాత్రం అదరహో అంటున్నారు, ఇవి చూసి ఇతర హీరోలు నేర్చుకోవాలి అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇన్వెస్ట్మెంట్ విషయం లో ఏ హీరో చెయ్యని తెలివైన ప్రణాలికలు మనోడు రచిస్తున్నాడు. ఏకీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద దాదాపు వరసగా ఐదు సినిమాలు చెయ్యడం కోసం రాజ్ తరుణ్ సంత్తకాలు పెట్టాడు అని మనకి తెలిసిందే.

దీనికి రెమ్యునరేషన్ గా అంటే ఈ ఐదు సినిమాలకీ కలిపి ఇతగాడు రెమ్యునరేషన్ గా డబ్బు తో పాటు అనిల్ సుంకర ఉంటున్న  గేటెడ్ కమ్యూనిటీ లో ఒక విల్లా ని తీసుకుంటూ ఉన్నాడు. దిల్ రాజు అల్లుడు కడుతున్న ఈ కమ్యూనిటీలో ఉన్న ఆ విల్లా ఖరీదు సుమారు ఆరున్నర ఏడు  కోట్లు.

అంటే ఈ నాలుగు సినిమాలకి కలిపి ఆయన రెమ్యూనరేషన్ ఒక కోటి రెండు కోట్లు తీసుకుంటూ  సుమారు 10  కోట్ల వరకూ అన్ని సినిమాలకీ కలిపి పారితోషికం తీసుకుంటాడు. ఇలా రియల్ ఎస్టేట్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసినట్టు ఏ హీరో ట్రై చెయ్యలేదు సొమ్ములు తీసుకుని దాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టడం కంటే హ్యాపీగా డైరెక్ట్ గా పారితోషికమే ఇన్వెస్ట్మెంట్ అయితే బెటర్ అనేది మనోడి ప్లాన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: