Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 19, 2017 | Last Updated 4:35 am IST

Menu &Sections

Search

అభిమాని కోసం మమ్ముట్టి ఏం చేశాడో తెలుసా..!

అభిమాని కోసం మమ్ముట్టి ఏం చేశాడో తెలుసా..!
అభిమాని కోసం మమ్ముట్టి ఏం చేశాడో తెలుసా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మళియాళ ఇండస్ట్రీలో  సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న హీరో మమ్ముట్టి అంటే తెలియని వారు ఉండరు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన మమ్ముట్టి షూటింగ్ సమయాల్లో తప్ప సాధారణ జీవితంలో చాలా సింపుల్ గా ఉంటారని టాక్.  తాజాగా మమ్ముట్టి ఓ వీరాభిమాని కోరిక తీర్చి ఎంతో సంతోష పెట్టారు. తమకు నచ్చిన హీరోతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడతారు. షెడ్యూల్ బట్టి హీరోలు అభిమానులకు సమయం కేటాయించవచ్చు.. ఒక్కోసారి కేటాయించకపోవచ్చు.
fan-selfie-with-mammoty-viral-video-ap-politics-te
తాజాగా  కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ ప్రాంతానికి చెందిన ఆదివాసి..ఒక్కసారే తన ఎదురుగా ఎంతో అభిమానించే హీరో మమ్ముట్టి కనబడటంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. న‌టుడు మ‌మ్ముట్టి అంటే అత‌డికి ఎంతో ప్రాణం. ఓ చిత్రం షూటింగ్ కోసం మ‌మ్ముట్టి వ‌య‌నాడ్‌కి వెళ్లాడు. ఎలాగైనా తన అభిమాన నటుడితో ఓ ఫోటో తీయించుకోవాలని ప్రయత్నం చేశాడు. 
fan-selfie-with-mammoty-viral-video-ap-politics-te
అప్పుడే ఆ దారిలో వ‌స్తున్న బెంజ్ కారుకు ఎదురుగా వెళ్లి ఆపి ఇందులో మ‌మ్ముట్టి సార్ ఉన్నాడా? అని అడిగాడు.కారులో ఉన్నవారు ఎవరు నువ్వు అనగానే.. తాను హీరో మమ్ముట్టి అభిమాని అని బాల‌న్ స‌మాధాన‌మిచ్చాడు.  వెంటనే ముందు సీట్లో కూర్చున్న మమ్ముట్టి అద్దం కిందికి దించి బాలన్ వైపు చూసి నవ్వాడు.