నటనకు భాష్యం చెప్పిన కళలకు కణాచి అక్కినేని గృహం. ఆయింటిలో అందరూ నటీనటులుగా తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపినవారే. అదే ఇంటికి కొత్తకోడలుగా ఈ మద్యనే గృహప్రవేశం చేసిన నటి మిస్ సమంత రూత్ ప్రభు, మిసెస్ సమంత అక్కినేని అయిన తరుణం లోనే తన మామగారైన అక్కినేని నాగార్జునతో ఒక ముఖ్య పాత్రలో నటించిన సినిమా ఈ రోజే విడుదలవటం యాదృచ్చికం. 

Related image

అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత, తన మామ నాగార్జునతో కలిసి తాను పోటీకి సై అంటూ నటించిన "రాజు గారి గది 2" సినిమా ఈ రోజే  (శుక్రవారం) విడుదల అవుతోంది. 127 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా హార్రర్, హ్యూమర్ కలబోత గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మలయాళ చిత్రం "ప్రేతమ్" ఆధారంగా తెర కెక్కిన ఈ సినిమా కు ఓంకార్ దర్శకత్వం వహించారు. పీవీపీ సంస్థ ఈ మూవీని నిర్మించింది.

Image result for raju gari gadhi 2 images

ఈ మూవీలో సమంత ఆత్మగా (దెయ్యం) నటించగా, నాగార్జున మానసిక నిపుణుడుగా (మెంటలిస్ట్‌) నటించారు. ఈ సినిమా "సమంత వర్సెస్ నాగార్జున" గా నిండి పోయిందట.  దెయ్యంగా పగ తీర్చుకోవాలని భావించే సమంత, దాని అడ్డుకోవడం కోసం ప్రయత్నించే మెంటలిస్ట్‌ పాత్రలో నాగార్జున ఒకరితో మరొకరు పోటీ పడి నటించారని సమాచారం.  


నాగ చైతన్యతో పెళ్లయ్యాక సమంత అక్కినేని కుటుంబ సభ్యురాలైంది. సమంత చైతన్య వివాహమైన అతి కొద్ది రోజులకే నటించిన ఈ చిత్రం విడుదల అవుతుండటంతో, అభిమానుల్లో ఆనందం ఆసక్తి పెరిగి సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో "అమృత" అనే "లా స్టూడెంట్" పాత్రలోనూ సమంత కనిపించనుంది. ‘రాజుగారి గది’లో హీరోగా నటించిన అశ్విన్‌ తో పాటు సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, షకళక శంకర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Image result for raju gari gadhi 2 images

మరింత సమాచారం తెలుసుకోండి: