వరుస హిట్  సినిమాలతో ఈ మధ్యకాలం లో ఏ హీరోకీ లేని బ్లాక్ బస్టర్ హిట్ లు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ కి. వరసగా టెంపర్ తో మొదలెట్టి మొన్నటి జై లవ కుశ  వరకూ ఎన్టీఆర్ హిట్లు కొడుతూనే ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయం లో సరైన క్లారిటీ రావడం లేదు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఇంకా మొదలు అవ్వడం లేదు, ఒక పక్క త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ చిత్రం షూటింగ్ నడుస్తూ ఉంది , అసలే పవన్ కళ్యాణ్ తో షూటింగ్ అంటే అది కాస్త స్లో గానే నడుస్తుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా సంక్రాంతి కి అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆ త‌ర‌వాత‌.. ఎన్టీఆర్ స్క్రిప్టు మొద‌లై, పూర్త‌య్యే స‌రికి మ‌రో మూడు నెల‌లైనా ప‌డుతుంది. ఈలోగా ఖాళీగా ఉండ‌డం ఎందుక‌న్న‌ది ఎన్టీఆర్ ఆలోచ‌న‌. అందుకే… ఈ ఆరు నెల‌ల్లో ఓ సినిమా పూర్తి చేద్దామ‌నుకొంటున్న‌ట్టు టాక్‌.

అందుకోసం ఇటీవ‌ల దిల్‌రాజుతోనూ ఎన్టీఆర్ సంప్ర‌దింపులు జ‌రిపాడ‌ని తెలుస్తోంది.రేపో ఎల్లుండో యూఎస్ ట్రిప్ వెయ్యబోతున్న తారక్ తన ఫామిలీ తో కలిసి ఎంజాయ్ చెయ్యబోతున్నాడు. ఆ ట్రిప్ పూర్తి అవ్వగానే త్రివిక్రమ్ తో సిట్టింగ్ ఉంటుంది. అక్కడ త్రివిక్రమ్ తో  సినిమాకి ఎంత టైం పడుతుంది అనేది తెల్చేసుకుని దానిబట్టి మధ్యలో గ్యాప్ కవర్ చేస్తూ ఒక సినిమా చేసే  గ్యాప్ ఉంటుందా  అనేది మాట్లాడుకుంటారు.

త్రివిక్రమ్ ఒక సినిమాకీ మరొక సినిమాకీ మధ్య చాలా గ్యాప్ తీసుకుంటాడు. ఇక స్క్రిప్ట్ ఓకే అవ్వడానికి కూడా త్రివిక్రమ్ టైం తీసుకుంటారు, ఇలోగా దిల్ రాజు బ్యానర్ లో చకచకా ఒక చిత్రం అవగొడదాం అని ఎన్టీఆర్ ఆలోచన. 


మరింత సమాచారం తెలుసుకోండి: