ఫేమస్ హీరోయిన్ రేజీనా కసాండ్రా  .. బంజారా హిల్స్ లోని ఒక స్కూల్ లో సందడి చేసింది. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ పెగా చేపట్టిన 'పెగా టీచ్ ఫర్ చేంజ్ ' కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండగా ఆమె దాంట్లో భాగంగా హైదారాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7 లోని ప్రభుత్వ స్కూల్ కి వెళ్ళడం విశేషం. అక్కడి విధ్యార్ధులతో చాలా సేపు టైం గడిపిన రేజీనా వారితో కలిసి ఇన్ సైడ్ అవుట్ అనే యానిమేషన్ సినిమా చూసింది.

ఆ తరవాత ఆమె ఆ సినిమా భావాన్ని పిల్లలు అందరికీ అర్ధమయ్యేలా చెప్పుకొచ్చింది. ఆంగ్లం మాట్లాడడం లోని తేలిక విధానం, కిటుకులూ అన్నీ పిల్లలతో చేబుతూ గడిపింది రేజీనా. రెజీనా రావడంతో వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. విద్యార్థులకు దైనందిన పాఠ్యాంశాలతో పాటు ఆటవిడుపు, ఆంగ్లంపై ఆసక్తి కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు పెగా ప్రతినిధులు తెలిపారు. 

పెగా ఇంకా త్వరలో ఎందరో విద్యార్ధుల కోసం హీరో లనీ హీరోయిన్ లనీ తీసుకుని రాబోతోంది. వీరి అంతిమ లక్ష్యం ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్ధుల సంఖ్య ని పెంచుతూ కార్పోరేట్ ల కంటే వారు ఎక్కడా తక్కువ కాదు అని చూపించడం.

ఇలాంటి ప్రోగ్రాం మాత్రమె కాకుండా పెగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తోంది. రేజీనా కూడా పిల్లలతో చాలా సేపు ముచ్చటగా గడిపారు. ఇలాంటి అర్ధం చేసుకోగలిగిన సెలెబ్రిటీ లు ఉంటె తమ లక్ష్యం పూర్తి అవవడానికి కష్టపడక్కరలేదు అంటున్నారు పెగా వారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: