సినిమా రంగంలో నటీమణులను లైంగిక ఉచ్చులోకి లాగి స్వప్రయోజనాలను సాధించుకొనే ప్రభుద్ధులకు అంతే లేదు. దీనికి సరిహద్దులూ లేవు. అవకాశాలే పెట్టుబడులు గా ఆశలే వినియోగవస్తువులుగా చలామణి అయ్యే ఆ రంగములో,  జరిగే అనేక అకృత్యాలపై మనదేశంలోని అన్నీ చిత్రపరిశ్రమల నుండి  అనేక మంది నటీమణులు తమ వెతలను అనేక వేదికలపై అనేక సందర్భాల్లో వెళ్ళగ్రక్కుతునే ఉన్నారు.

 

నిర్మాతలు, దర్శకులు, కథానాయకులు తమను లైంగికంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని వీరు నిశ్శబ్ధాన్ని చేదించు కుంటూ బయటకు వచ్చి వివరిస్తున్నారు. ఒక్కొక్కరిగా తాము ఎదుర్కొన్న విషాదకర అనుభవాలను వివరిస్తున్నారు.

 Image result for aishwarya & weinstein


ఇటీవలే హాలీవుడ్ ప్రముఖ నిర్మాత 'హార్వీ విన్‌స్టన్' సెక్స్ స్కాండల్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. "న్యూయార్క్ టైమ్స్" అమెరికా నుండి వెలువడే ప్రసిద్ధ అంతర్జాతీయ పత్రిక. ఆ నిర్మాత గురించి అది ప్రచురించిన వార్త కథనం అంతర్జాతీయ సంచలనంగా నిలుస్తోంది. ఈ 65యేళ్ల సినీ నిర్మాత గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై మందికి పైగా మహిళలపై నిరాటంకంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని “న్యూయార్క్ టైమ్స్” ఆరోపించింది.


ఆ పత్రిక వెల్లడించింది అంత ఆషామాషి వ్యవహారం కాదు. మూడుదశాబ్ధాల కిరాతక చీకటి కామ కార్యకలాపాలను అనెక మంది విన్‌స్టన్ నుంచి ప్రయోజనాలను పొందినవారు, ఆయనవల్ల లాభపడ్డవారు, రాజకీయంగా కేంద్రాలకు అతి దగ్గర ఉన్న ప్రజాస్వామ్యవాదులూ ఖండిస్తున్నా నిశ్శబ్ధాన్ని చేదించటం ఒక విశేషం. 

 

ఇందుకు అనేక తాజా ఉదంతాలను సోదాహరణంగా పేర్కొంది. ఈ మద్య కొంత మంది హీరోయిన్లు కూడా తాము విన్-స్టన్ చేతి లో ధారుణ లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్టుగా ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. అనేక మంది నటీమణులకు ఇతడు డబ్బులు ఇచ్చి చీకటి వ్యవహారాలను సెటిల్ చేసుకున్నట్టుగా 'న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది.

Image result

ఏంజెలీనా జోలీ


అప్పుడప్పుడే కొత్తగా సినీ రంగం లో అనేక ఆశలతో ఎదుగుతున్న, ఎదగాలని ప్రయత్నిస్తున్న హీరోయిన్లను ట్రాప్ చేయడం, ప్రలోభపెట్టటం, వాళ్లకు ఆకర్షనీయమైన అడ్వాన్సులు ఇచ్చి ఆకట్టుకోని, అవకాశాల ఆశలు చూపి, ఆపై  వారిని లైంగికంగా వినియోగించుకోవటం విన్‌స్టన్ అలవాటుగా మారింది. ఇలా ఈ నిర్మాతపై ఆరోపణలు చేసిన వారిలో విశ్వవిఖ్యాత  హాలీవుడ్ నటి "ఏంజెలీనా జోలీ" కూడా ఉన్నారు. ఆమె కూడా ఈయన గారి కామకలాపాల బాధితురాలేనట.

 

అయితే ఈ ఆరోపణలను హార్వీ విన్‌స్టన్ అతడి న్యాయవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కావాలనే హార్వీ విన్‌స్టన్ పరువు తీస్తున్నారని, ఈ విషయంలో తాము కోర్టులో పరువునష్టం దావా వేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

 

"ది వోగ్" పత్రిక ఎడిటర్ 'అన్న వింటార్'   "ఈ విధమైన ప్రవర్తన క్షమించరానిది. అంగీకారయోగ్యం కానిదని" విశ్లేషించింది. అంతేకాదు స్వతంత్రంగా భయం లేని వాతావరణం లో అందరూ పనిచేసే పరిస్థితులను కల్పించటం మనవిధి" అని పేర్కొన్నారు.

 

అయితే ఈ సినీ నిర్మాతపై వస్తున్న ఆరోపణలను అతడి భార్య జార్జియా చాప్మాన్ కూడా ధ్రువీకరిస్తూ ప్రకటనలు చేయటం గమనార్హం. అంత నీచచరిత్ర ఉన్న అతడిని వదిలిపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ మధ్య నిర్మాత భార్య ప్రకటించింది. ఈ సినీ నిర్మాతపై వస్తున్నలైంగిక ఆరోపణలు నిరూపణ అయితే కనీసం పాతికసంవత్సరాల పాటు శిక్షపడే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

 

నార్కోటిక్స్ కేసుల్లో నిందితులన్న ఆరోపణలున్న అగ్రకుటుంబాలకు చెందిన అగ్రనటుల పేర్లు సహితం బయటపెట్టలేని అసమర్ధ రాష్ట్ర ప్రభుత్వాలున్న మనదేశం లో అలాంటి స్థాయిలో శిక్షలు ఉన్న కేసులు విజయం సాధించటం కల్ల. ఒక వర్గం ఆధీనం లో ఉండే మీడియా సైతం ఈ అంధకారాన్ని చేధించలేదు.

 

 

హార్వీ విన్‌స్టన్, అతడి భార్య జార్జియా చాప్మాన్ 


Image result for aishwarya & weinstein


ఈ మహానుభావుడు మన అందాలతార ఐశ్వర్యారాయ్ పై కూడా మనసు పారేసుకున్నట్లు వార్తలు ఉన్నాయి. ఆమె మానేజర్ ఆమెను వీడి భారీన పడకుండా కాపాడిందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: