లోకనాయకుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్నాడన్న వార్త తమిళనాడులో కొత్త ప్రకంపణలు సృష్టిస్తుంది. రజినికి పోటీగా కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలనుకోవడం దానికి అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకోవడం జరిగింది. తన కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ అందుకున్న కమల్ తన గారాలపట్టి శృతి హాసన్ కామెంట్స్ ఇప్పుడు అందరిని షాక్ అయ్యేలా చేస్తున్నాయి.


కమల్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటిదాకా స్పందించిన శృతి హాసన్ రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో మాట్లాడింది. తన తండ్రి నిజాయితిపరుడు మంచి వ్యక్తి కాబట్టి మంచి లీడర్ అవుతాడని అన్నది. ప్రజాసేవే లక్ష్యంగా కమల్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు చెప్పింది శృతి హాసన్. అన్ని విషయాల్లోనూ ఆయన ముక్కుసూటితనం ఆయనలో ఉన్న మంచి లక్షణం అని అన్నది.


తను చేసే పనిలో స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే అది ప్రారంభిస్తారని అన్నది శృతి హాసన్. కమల్ గారాలపట్టిగా శృతి హాసన్ సినిమాల్లో కాస్త వెనుకపడ్డట్టు అనిపించినా తన కెరియర్ కు ఎలాంటి భంగం కలగలేదని.. తానే కావాలని సినిమాలు చేయట్లేదని అంటుంది. ఇక రెగ్యులర్ పాత్రలు రాబట్టే సినిమాలు చేయట్లేదని అంటున్న శృతి కమల్ రాజకీయాల్లో కూడా రాణించగలరని అన్నది.


ప్రస్తుతం శృతి హాసన్ చేతుల్లో సినిమాలేవి లేవు కమల్ తో కలిసి చేస్తున్న శభాష్ నాయుడు మాత్రమే చేస్తుంది. ఇక ఎక్కువగా ఆమె లండన్ లో ఉంటున్నట్టు తెలుస్తుంది. అక్కడ లవర్ తో ఆమె కాలం గడుపుతుందని అంటున్నారు. మరి శృతి కోరినట్టు కమల్ హాసన్ తమిళనాడు రాజకీయాల్లో కొత్త ప్రకంపణలు సృష్టిస్తాడో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: