నాగార్జున సమంత ప్రధాన పాత్రలు పోషించిన రాజుగారి గది 2 చిత్రం నిన్న థియేటర్ లలో విడుదల అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. మొదటి భాగం హర్రర్ కామెడీ తో తీసిన డైరెక్టర్ ఓంకార్ రెండో భాగం మొత్తం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న సినిమా విడుదల చేసాడు.

ఈ సినిమా విడుదల అయిన ప్రతీ ప్రాంతం లో పాజిటివ్ రెస్పాన్స్ వినపడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇక ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు ఇతర దేశాల్లోను భారీ స్థాయిలో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.

రాజుగారి గది 2 కూడా ఇదే మార్గం లో వెళ్లి తన హర్రర్ సత్తా చాట బోతోంది. కెన్యా .. ఉగాండా .. టాంజానియా .. ఆఫ్రికన్ దేశాలతో పాటు, స్వీడన్ .. డెన్మార్క్ .. కజికిస్థాన్ .. కిర్గిస్థాన్ లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

అంతే కాకుండా ఏడు అరబ్ కంట్రీ లలో కూడా ఈ చిత్రం విడుదల అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువ కలక్షన్ రాబోతోంది అంటున్నారు. ఇప్పటికే హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్ ల ప్రకారం పది కోట్లు వచ్చేసింది వీళ్ళకి. సో ఇక ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళడానికి పెద్ద టైం పట్టేలా కనపడ్డం లేదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: