సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఇప్పటికే అందరిలో ఆసక్తి రేగింది. బాలయ్య హీరోగా రాబోతున్న ఈ సినిమాతో మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు అనే వార్త అందరికీ ఫుల్ కిక్ ఇస్తోంది. ఈ నేపధ్యం లో ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

కార్తీక మాసం లో ఈ సినిమాని ఒక మంచి రోజు చూసి గ్రాండ్ గా లాంచ్ చేస్తారట బాలయ్య. ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చివరి దశకి చేరుకున్నట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ జీవితం లో చిన్నతనం , టీనేజ్ లు ఒక ఐదు నిమిషాల పాటు చూపించి ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమాల మీదా సెకండ్ హాఫ్ మొత్తం పాలిటిక్స్ మీదా కథ నడప బోతున్నాడు డైరెక్టర్ తేజ అంటున్నారు. క్లైమాక్స్ మాత్రం నాదెండ్ల భాస్కరరావు - ఎన్టీఆర్ ల మధ్యన విభేదాలు చూపిస్తూ కథ ముగిస్తారు.

ఆ తరవాత రోలింగ్ టైటిల్స్ లో ఎన్టీఆర్ అస్తమయం ఎలా జరిగింది, అప్పట్లో జనాలు ఎలా సోక సముద్రం లో మునిగిపోయారు ఇలాంటివి చూపిస్తారు అని సమాచారం. ఏదేమైనా ఎన్టీఆర్ జయంతి నాటికి సినిమా పూర్తి చేసెయ్యాలి అని బాలయ్య గట్టి పట్టుదల మీద ఉన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: