టాలీవుడ్ భల్లాల దేవ.. అనగానే రానా తప్ప ఇంకో ఇమేజ్ కనిపించదు. రానా దగ్గుబాటి ఇప్పటికే వరుస విజయాలతో టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలతో సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ తనదైన మార్క్ ను చూపిస్తున్నాడు. ఇప్పుడు రానా 1945 డేస్ కి వెళ్ళి.. ఓల్డ్ గెటప్ లో ఆడియన్స్ కు హాయ్ చెప్పబోతున్నాడు.

Image result for rana 1945

రానా దగ్గుబాటి నటిస్తున్న కొత్త చారిత్రాత్మక చిత్రం ‘‘1945’’. ఇందులో రానా గెటప్ సినిమాకు హైలైట్ గా నిలవనుందట. ఘాజీ సినిమాలో నేవీ ఆఫీసర్ గా రానా మంచి మార్క్స్ కొట్టేశాడు. బాహుబలిలో భల్లాల దేవగా రానా చరిత్ర సృష్టించాడు. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ రానా దగ్గుబాటి అంటే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. రానా ప్రతి సినిమాలో డిఫెరెంట్ గెటెప్స్ తో ఆడియన్స్ కు ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తాడు. రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి మూవీలో వడ్డీ వ్యాపారిగా.. పొలిటిషియన్ గా.. చివరికి రాధా జోగేంద్రగా ప్రతీ క్యారెక్టర్ ను రానా అద్దరగొట్టేశాడు.

Image result for rana 1945

రానా అంటే ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ ఫుల్ ఫేమస్. ఐతే ఇప్పుడు రానా దగ్గుబాటి డిఫెరెంట్ జోనర్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట. అది కూడా 7 దశాబ్దాల వెనక్కి వెళ్లి మరీ మేకప్ వేయనున్నాడట. 7 దశాబ్దాలంటే లెక్కలేసుకుంటున్నారు కదా.. 7దశాబ్దాలంటే 1945 నాటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాలంలోకి వెళ్తున్నాడిపుడు మన భల్లా.

Image result for rana 1945

1945 కాలంలో ఓ సైనికుడి ప్రేమ కథను వెండితెరపై చూపించడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఓ నేవీ ఆఫీసర్ గా వడ్డీ వ్యాపారిగా.. పొలిటీషియన్ గా.. విలన్ గా.. ప్రేమికుడిగానే చూశాం. బట్ ఈ సినిమాలో రానా ఓ సిపాయిగా డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడట. 1945వ సంవత్సరానికి సంబంధించిన కథ కావడంతో, అప్పటి కాలంలో జరిగిన కొన్ని సంఘటనలని మన కళ్ళకు కట్టినట్టు చూపించేందుకు భారీ సెట్స్ ని కూడా రెడీ చేస్తున్నారట. ఇంకో విషయం... ఈ సినిమా టైటిల్ కూడా ‘‘1945’’. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా కి జోడీగా రెజీనా నటించబోతోంది.

Image result for rana 1945

1945 టైటిల్ తో తెరకెక్కతున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్‌ ఫినిష్ చేసుకుంది. ప్రజంట్ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించింది చిత్ర యూనిట్. 1945 నాటి పోరాట ఘట్టాలతో.. స్వాతంత్ర ఉద్యమాన్ని తెరకెక్కించేపనిలో బిజీ అయిందట ఈ టీమ్. చూద్దాం మరి ఆ కాలంలో రానా ఎలా ఉండబోతున్నాడో.. ఏం చేయబోతున్నాడో..!!


మరింత సమాచారం తెలుసుకోండి: