తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో ప్రేమజంటలు వచ్చాయి.  ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో పరిచయం అయిన  అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత‌ల కొంత కాలంగా ప్రేమించుకున్నారు.  ఆటో నగర్ సూర్య, మనం చిత్రంలో జంటగా కనిపించారు. గత సంవత్సరం తమ కుటుంబ పెద్దలతో ప్రేమ వివాహం చెప్పడం వారి దీవెనలు తీసుకోవడం జరిగింది.   
సమంత పేరు మార్చుకుంది..అందుకేనా..!
ఈ నెల 6, 7 తేదీలలో సమంత, నాగ చైతన్యల వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం గ్రాండ్ గా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగడం విశేషం. ఈ పెళ్లి సందడి లో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా బాగా హడావిడి చేశారు.  ఇక నాగార్జున్, వెంకటేష్ లు డ్యాన్స్ చేసి అందరికీ కనువిందు చేశారు.
Most adorable pictures of Chaitanya & Samantha Wedding
మరి కొద్ది రోజులలో నాగ చైతన్య, సమంతల రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుండగా, ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు.  ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో పలు ఫొటోలు కనబడుతున్నాయి.  ఎన్నో ఫోటో నెట్టింట్లో సందడి చేసినా..సమంతకు మాత్రం ఓ ఫోటో చాలా బాగా నచ్చిందట.

సమంత పేరు మార్చుకుంది..అందుకేనా..!
‘నాకు ఎంతో  ఇష్టమైన ఫొటో ఇది, తల్లీకొడుకు’, ‘నేను చాలా అభిమానించే వ్యక్తి ఆమె’ అంటూ ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సమంత పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో నాగచైతన్య, ఆయన తల్లి లక్ష్మి కలిసి నడుచుకుంటూ వస్తుంటారు. ఇలాంటి ఫోటోలు చాలా అరుదుగా కనిపిస్తాయని చైతూ, లక్ష్మీ అత్తగారి ఫోటొ చూసి తెగ మురిసిపోతుంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: