బాలీవుడ్  ప్రముఖ దర్శకులు లేఖ్ టాండన్ (88) మృతి చెందారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను బుల్లి తెరకు పరిచయం చేశారు దర్శకుడు లేఖ్ టాండన్.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ముంబైలో కన్నుమూశారు.  తన నివాసంలో తన కుటుంబసభ్యుల సమక్షంలోనే తుదిశ్వాస విడిచారు. 1929 ఫిబ్రవరి 13 న జన్మించిన టాండన్ 15 సెప్టంబర్ 2017 నాడు మృతి చెందాడు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి మృతి
ఈయన 14 సినిమాలకి డైరెక్టర్ గానే కాకుండా 6  సినిమాలలో మంచి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. 3 సీరియల్స్ కి డైరెక్టర్ గా పనిచేశారు.  1988లో టాండన్ దర్శకత్వం వహించిన ‘దిల్ దరియా’ అనే ధారావాహికలో షారుక్కి అవకాశం ఇచ్చారు. అలా షారుక్ బుల్లితెరకు పరిచయమయ్యాడు.

ఈ సీరియల్తో షారుక్కి మంచి గుర్తింపు రావడంతోనే సినిమాల్లో అవకాశం వచ్చింది. ఆమ్రపాలి, అగర్ తుమ్ న హోతే తదితర ఎన్నో గొప్ప చిత్రాలను టాండన్ తెరకెక్కించారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్, రిషి కపూర్, అమితాబ్ బచ్చన్, షబానా అజ్మీ, శేఖర్ కపూర్, అశుతోష్ గోవరికర్ తదితరులు సంతాపం ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: