ఐదు సంవత్సరాలు, తొమ్మిది సినిమాలు, అన్నీ సూపర్ హిట్సే. 9 సినిమాలకు గాను 26 అవార్డు లకు నామినేట్ అవ్వగా 8 అవార్డులను గెలుచుకున్న బాలీవుడ్‌ యువ కథానాయకుడు, హైపర్‌ హీరో గా పేరొందిన వరుణ్‌ ధావన్‌ (30) గురించి చెప్ప తగిన మాటలు.

Image result for madame tussauds museum



ఈ విజయాలేమీ ఆషామాషీ వ్యవహారం మాత్రం కాదు, 100% సక్సెస్ రేట్ సాధించటం, నేటి పోటీ యుగం లో ఒక యువ కథా నాయకునికి కష్టసాధ్యమే. మొత్తం హాలీవుడ్  కథానాయకుల్లో వరుసగా నటించిన 9  సినిమాలు ఘనవిజయం సాధించటం ఇదే తొలిసారి. అందుకే ఈ చరిత్రాత్మక కథానాయకునికి ప్రపంచం బ్రహ్మరథం పడుతుంది. వసూళ్ళు కూడా అత్యద్భుతం.


Varun Dhawan wax statue at Madame Tussauds


అలాగే ప్రపంచం లోని అరుదైన గౌరవానికి ఎంపికయ్యారు. అదే ప్రతిస్టాత్మక "మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం"లో ఈ యువ కథానాయకుని మైనం విగ్రహం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బాలీవుడ్‌ తరపున అమితాబ్‌, షారూఖ్‌, అమీర్‌, సల్మాన్‌, ఐష్‌, హృతిక్‌, సౌత్‌ లో ప్రభాస్‌ ఇలా పలువురి సినీ సెలబ్రిటీల విగ్రహాలు 'మేడమ్‌ టుస్సాడ్‌' లో ఏర్పాటు కావటానికి చాలా యేళ్ళే పట్టింది.  అయితే చిన్న వయసు లోనే ఈ ఘనత సాధించిన నటుడిగా వరుణ్‌ రికార్డు క్రియేట్‌ చేశాడు. 


Image result for madame tussauds museum


హంకాంగ్‌లోని మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియం శాఖలో వరుణ్‌ ధావన్ ప్రతిమను ఏర్పాటు చేసేందుకు మ్యూజియం అధికారు లు ముందుకు వచ్చారు. ఈ మేరకు కొత్త చిత్రం షూటింగ్‌లో ఉన్న వరుణ్‌ దగ్గరికే స్వయంగా వెళ్లి మరీ కొలతలు తీసేసు కున్నారు. ఇదే మ్యూజియంలో మహత్మా గాంధీ, నరేంద్ర మోదీ, అమితాబ్‌ బచ్చన్‌  విగ్రహాలు ఉండగా, వారి సరసన ఇప్పుడు ఈ యువ బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్ కూడా చేరిపోతున్నాడు. 30 యేళ్ళ వయసు ఐదేళ్ళ సినీ అనుభవానికే ఈ అరుదైన గౌరవం దక్కించుకోవటమంటే మాటలు కాదు.  


Image result for varun dhawan images



వరుణ్‌ ధావన్ ఒకవైపు నటుడిగా, మరోవైపు యూత్‌ ఐకాన్‌ గా కోట్లాది అభిమానులను భారత దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంపాదించు కున్నారని, అందుకే ఆయన విగ్రహ ఏర్పాటు చేయ బోతున్నామని మ్యూజియమ్‌ నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది ఈ విగ్రహం సందర్శకుల కోసం అందుబాటులోకి రానుంది. మరోవైపు తన విగ్రహ ఏర్పాటుపై ట్విట్టర్‌ వేదికగా వరుణ్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: