కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ సినిమా అంటే ఆ రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే.. సౌత్ లో 100 కోట్ల వసూళ్లను రాబట్టిన మొదటి స్టార్ హీరో విజయ్. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినికాంత్ కు ఈక్వల్ గా స్టార్ ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ ఈ దీవాళికి మెర్సల్ సినిమాతో రాబోతున్నాడు.


తెరి సినిమా డైరెక్ట్ చేసిన అత్లీ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. తెరిలో విజయ్ ను అదిరిపోయేలా చూపించిన అత్లీ మళ్లీ అదే విజయ్ తో ఈసారి డ్యుయల్ రోల్ లో అదరగొట్టించేశాడు. సినిమా రిలీజ్ సందర్భంగా విజయ్ ఫ్యాన్స్ ఏకంగా 150 అడుగుల భారీ కటౌట్ ఒకటి ఏర్పాటు చేశారు. దాదాపు ఇంత భారీ కటౌట్ ఏ హీరోకి పెట్టలేదని తెలుస్తుంది.


సినిమాలో సెకండ్ రోల్ పంచెకట్టుతో కొడవలి పట్టుకుని ఉన్న స్టిల్ తో ఈ కటౌట్ ఏర్పాటు చేశారు. విజయ్ స్టామినా ఏంటో ఈ కటౌట్ చూసినా చెప్పొచ్చు. ఇక సినిమా విషయానికొస్తే సమంత, కాజల్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించారు.


చూస్తుంటే ఈసారి తెలుగులో కూడా ఈ సినిమాతో విజయ్ మార్కెట్ దక్కించుకునేలానే ఉన్నాడు. శరత్ మరార్ తెలుగులో మెర్సల్ సినిమాను అదిరిందిగా డబ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ నామ మాత్రంగానే ఉన్నా సినిమా హిట్ అవ్వడం ఖాయమని శరత్ మరార్ ధీమాగా ఉన్నారట.



మరింత సమాచారం తెలుసుకోండి: