పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఛాన్స్ రావాలంటే లక్ కలిసి రావాలి. అలాంటిది కోలీవుడ్ యువ సంగీత దర్శకుడికి అది త్వరగానే వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మొన్నామధ్య ఓ చిన్న బిట్ సాంగ్ బయటకొచ్చి చూస్తే అంటూ వచ్చి అలరించిన అనిరుధ్ ఫుల్ సాంగ్ పక్కా హిట్ అంటున్నాడు.


అంతేకాదు పవర్ స్టార్ సినిమా ఆల్బం మొత్తం అదిరిపోతుందని చెప్పేస్తున్నాడు అనిరుధ్. త్రివిక్రం లాంటి దర్శకులతో పనిచేయడం అదృష్టమని చెబుతున్నాడు. పవన్ త్రివిక్రం కాంబినేషన్ లాంటి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కుర్రాడిని చూస్తుంటే ఇక్కడ వరుస అవకాశాలు అందుకునేలా లానే ఉన్నాడు.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమాలో పవన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఖుష్బు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోశిస్తుందట. 


సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల ఫలితాలతో నిరాశ చెందిన పవన్ కళ్యాణ్ మరోసారి త్రివిక్రం తో కలిసి తన సత్తా ఏంటో చూపాలని ఫిక్స్ అయ్యాడు. టైటిల్ దాదాపు అజ్ఞాతవాసి అని ఫిక్స్ అయినట్టే. మరి ఈ అజ్ఞాతవాసి ఎలాంటి సంచలన రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. 2018 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా పవన్ కు హిట్ ఇస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: