మహానటి సావిత్రి ఆత్మకథని తెరకేకిస్తూ .. 'మహానటి' అనే టైటిల్ పెట్టాడు డైరెక్టర్ నాగ అశ్విన్.ఈ సినిమా విషయం లో ఎప్పటి నుంచో షూటింగ్ జరుగుతూ ఉన్నా కాస్తంత పాత కాలపు రోజులని చూపించాల్సి రావడం తో ఈ సినిమా షూటింగ్ నెమ్మదిగా నడుస్తోంది. హీరోయిన్ గా సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తుంది కాగా సమంత ఒక కీలక పాత్ర చేస్తోంది.

ఎన్టీఆర్ , ఏ ఎన్నార్ పాత్రల్లో ఎవరు కనిపిస్తారు ఆనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించి మరొక ఆసక్తికర విషయం బయట పడింది. అల‌నాటి ద‌ర్శ‌కులు కెవి రెడ్డి, ఎన్వీ ప్ర‌సాద్ పాత్ర‌ల కోసం తెలుగు ప్రస్తుత డైరెక్టర్ లు అవసరాల శ్రీనివాస్, డైరెక్టర్ క్రిష్ లని తీసుకున్నారు అని తెలుస్తోంది.

ఆయా పాత్రల్లో కనపడ్డం కోసం వారు ఇప్పటికే సిద్ధం అయ్యారట. సావిత్రి జీవితం లో వారి పాత్ర ఎక్కువే ఉంది , ఆమె వారిద్దరి డైరెక్షన్ లో చాలా సినిమాలు చేసారు. సో వారి తో సంభాషణ లూ - చర్చలూ - సంఘటన లూ అన్నీ పక్కగా రాసుకున్నాడు డైరెక్టర్ నాగ అశ్విన్. ఇంతకీ ఎన్టీఆర్, ఏ ఎన్నార్ పాత్రలకి ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: