టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ నుంచి ఐరెన్ లెగ్ గా ట్రాక్ మార్చబోయిన బ్యూటీ రెజినా. వరుసగా షాక్ లు తగలడంతో ఈ బ్యూటీ డ్యూటీ కంచికి చేరింది అనుకున్నారు. ఇక చిన్నాచితకా సినిమాలతో సరిపెట్టుకోవల్సిందే అని తెల్చేసారు. కట్ చేస్తే.. ఇప్పుడు బాలయ్య, రానా మూవీలకు తన కలరింగే అవసరమైయింది. బడా స్టార్స్ కి తన జోడీయే బెస్ట్ అనే టాక్ వినిపిస్తోంది. సో.. ఇప్పుడు రెజీనాకు టాలీవుడ్ లో గుడ్ టైం స్టార్ట్ అయినట్లుంది.

 Image result for regina cassandra without makeup

టాలీవుడ్ లో తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న చెన్నై బ్యూటీ రెజినా కాసాండ్రా. సుబ్రమణ్యం ఫర్ సెల్, పవర్ తో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కానీ ఆ తరువాతే  సీన్ సితారైపోయింది. సౌఖ్యం అంటే లక్ హ్యండ్ ఇచ్చింది. శౌర్యం అంటే తన కటౌటే కనుమరుగైయ్యే పరిస్దితి కనిపించింది.

 Image result for regina cassandra without makeup

ఇలా వరుసగా పంచ్ లు పడుతున్న టైంలో జో అచ్యుతానంద అంటూ ఢిఫరెంట్ రోల్ లో గోల చేసి సింగిల్ హిట్ ను తన ఎకౌంట్ లో వేసుకుంది. కాని ఈ ఆనందం ఎంతోసేపు లేకుండా పోయింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో గ్లామర్ రూట్ లో బీట్ పెంచి నక్షత్రంగా మెరవబోతే అడ్రస్ మిస్ అయ్యింది. ఈ సినిమా ఇచ్చిన పంచ్ తో ల్యాంగ్ గ్యాప్ తీసుకునే పరిస్థితి కనిపించింది.

 Image result for regina cassandra without makeup

నక్షత్రంతో వెలవెలబోయిన రెజీనా కెరీర్ కంచికి చేరిందని అందరూ డిసైడైపోయారు. కట్ చేస్తే ఇప్పుడు వరుస సినిమాలతో వాయించేందుకు రెడీ అయిపోయింది. ప్రజంట్ నారా రోహిత్ హీరోగా తెరకెక్కతున్నబాల‌కృష్ణుడులో  గ్లామర్ రూట్ లో ఘాటు పెంచింది.

 Image result for regina cassandra without makeup

రానా లెటెస్ట్ మూవీ 1945లో కూడా చీరకట్టుతో కనికట్టు చేయబోతోంది రెజినా. ఈ సినిమాలో  రానాతో నిశ్చితార్థం జరిగి పెళ్లికి సిద్ధమయ్యే చెట్టియార్ అమ్మాయి పాత్రలో మెరవనుంది. మేకప్ లేకుండా చాలా సాదాసీదా అమ్మాయిగా కనిపిస్తూనే నేచురల్ లుక్ లో కిక్ ఇవ్వబోతోంది.

 Image result for regina cassandra without makeup

ఇలా రెండు సినిమాలతో బిజీ అయిన రెజినాకి ఇప్పుడు మరో బంఫర్ ఆఫర్ ఎకౌంట్ లో పడింది. బాలయ్య - కేఎస్ రవికుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీలో మూడో హీరోయిన్ గా ప్లేస్ కన్ఫామ్ చేసుకుంది. కథను మలుపుతిప్పే పాత్రలో తను మెరవబోతోందట.

 Image result for regina wallpapers hd in kotha janta

ఎలా చూసినా వరుస ప్లాప్స్ తో కథ కంచికి చెరిందనుకున్న రెజినాకు కాలం కలిసొస్తోంది. ఇప్పటికే 3 సినిమాలు ఎకౌంట్ లో పడటంతో తన డ్యూటీలో స్పీడ్ పెరిగింది. ఈ మూడిట్లో ఏ రెండు రీసౌండ్ చేసినా తన సీన్ మారే ఛాన్స్ ఉంది. అదే జరిగితే  నెక్ట్ సీజన్ లో రెజీనా హల్ చల్ షురూ కావడం తథ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: