దీపావళి అంటే మన ఇంట్లో వాళ్ళతో సందడి చేసుకునే పండగ. అనునిత్యం కలవడం కుదరని ఈ హైరానా బతుకుల మధ్యన ఎప్పుడో ఒకసారి వచ్చే ఈ పండుగలలో కలుసుకుని టాపసులు కాల్చుకుని అల్లరి చేస్తూ ఉంటాం మనందరం.

మనమే ఇంత బిజీ గా ఉంటె ఇక సినిమా వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి, ఎప్పుడూ ఏదో ఒక షూటింగ్ తో షెడ్యూల్ తో బిజీ గా ఉండే ఆ సినిమా వాళ్ళు దొరక్క దొరక్క పండగ దొరికితే, అందులోనూ దీపావళి లాంటి పండగ దొరికితే ఇంట్లో వారితో గడపడం అనే ఛాన్స్ మిస్ చేసుకుంటారా ? చేసుకోరు కదా ! అయితే ఒక టాప్ హీరోయిన్ మాత్రం అందుకు భిన్నంగా చేస్తోంది.

హీరోయిన్ హన్సిక గురించి మనందరికీ తెలిసిందే, తక్కువ ఏజ్ లో తెలుగునాట అడుగు పెట్టిన హన్సిక కాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అయిపొయింది. ఈ ఏడాది తన పండగ చాలా స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకోవాలని చూస్తోంది ఆమె.

తన స్నేహితులు బంధువులతో పాటుగా తాను దత్తత తీసుకున్న దాదాపు వందమంది పిల్లలతో ఆమె పండగ జరుపుకుంటోంది ఇవాళ. వారి కోసం చాలా టాపసులు కొన్న హన్సిక వారితో ఎక్కువ టైం ఇంట్లో వారితో తక్కవ టైం గడిపేలా ప్లాన్ చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: