నాచురల్ స్టార్ నాని ఫాం ఏంటో అతని సినిమాల రిజల్టు చూస్తే తెలుస్తుంది. రెండు హ్యాట్రిక్ లను దాటేసిన నాని ఈ ఇయర్ మరో హిట్ కోసం వస్తున్నాడు. వేణు శ్రీరాం డైరక్షన్ లో నాని హీరోగా వస్తున్న సినిమా ఎం.సి.ఏ. ఈ సినిమాలో నాని లుక్ దీవాళి సందర్భంగా నిన్న రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత నాని మేర్లపాక గాంధి, హను రాఘవపుడి డైరక్షన్ లో సినిమాలు చేయనున్నాడు.


మేర్లపాక గాంధితో కృష్ణారున యుద్ధం తర్వాత హనుతో సినిమా ఉంటుందో లేదో తెలియదు కాని నేను శైలజ డైరక్టర్ కిశోర్ తిరుమలతో సినిమాకు ఫిక్స్ అయ్యాడు నాని. ఈ సినిమాకు టైటిల్ గా చిత్రలహరి అని పెట్టబోతున్నారట. చిత్రలహరి అంటే దూరదర్శన్ లో పాటల ప్రోగ్రాం గుర్తుకు వస్తుంది. చిన్నప్పటినుండి ఆ టైటిల్ కు ఆడియెన్స్ కనెక్ట్ అయ్యారు. 


అదే టైటిల్ తో సినిమా చేస్తున్నాడట నాని. ఇక సినిమా టైటిల్ పరంగా చూస్తే సినిమా చిత్ర పరిశ్రమకు సంబందించినదని చెప్పొచ్చు. సినిమా పరిశ్రమ నేపథ్యంతో అది కూడా నాని లాంటి నాచురల్ స్టార్ తో సినిమా ఎలా ఉంటుందో చూడాలి. నేను శైలజతో రాం కు సూపర్ హిట్ ఇచ్చి మళ్లీ అదే రాం హీరోగా ఉన్నది ఒకటే జిందగి సినిమాతో వస్తున్నాడు కిశోర్. 


ఈ నెలాఖరున సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా కిశోర్ తిరుమలకు హిట్ వస్తే ఇక నానితో సినిమా షురూ అయినట్టే లెక్క. సినిమా టైటిల్ తో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తున్న నాని చిత్రలహరితో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: