ప్రపంచ వ్యాప్తంగా దివ్య దీప కాంతులతో దీపావళికి ఒక రోజుముందు విడుదలైన కోలీవుడ్ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ నటించిన "మెర్సల్" మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న విడుదలైంది. తెలుగులో ఈ  మూవీని "అదిరింది" పేరుతో 19న (ఈరోజు) విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా మళ్లీ అక్టోబర్ 27కి వాయిదా పడింది. 


Image result for mersal heroines images


ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్‌లపై విడుదలైన విజయ్ మెర్సల్ సినిమాకు 'పూర్తి పాజిటివ్ టాక్' రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీనే  సృష్టిస్తుంది.  తొలిరోజు కలెక్షన్స్ విషయానికి వస్తే, తమిళనాడు "మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ హీరో విజయ్"  మెర్సల్.


Image result for mersal success images



*మూవీ తొలి రోజు  రూ.19 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.* *ఒక్క చెన్నై లోనే రెండు కోట్లు కలెక్షన్స్ సాధించడం విశేషం.
*అమెరికాలో 250 స్క్రీన్‌లపై భారీగా విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు రూ. 2.25 కోట్లు కలెక్ట్ చేసినట్టు "ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్" ట్వీట్ చేశారు.
*ఇక ఆస్ట్రేలియా, మలేసియా, యూకే లలోనూ అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది మెర్సల్.
*ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ. 31 కోట్ల వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
*భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తం గా రూ.160 కోట్ల బిజినెస్‌ను సాధించింది.


మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో మరిన్ని మరిన్ని భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


అయితే ఈ మధ్యకాలంలో విడుదలైన పెద్ద చిత్రాలకు తొలి రెండు రోజులు కలెక్షన్స్ భారీగానే ఉంటున్నా తరువాత చతికిలబడుతున్నాయి. మరి "మెర్సల్ కలెక్షన్స్ హవా" కొనసాగిస్తుందో? లేదో? చూడాలి. పాసిటివ్ టాక్ వస్తే విజయ్ మూవీకి తిరుగుండదని గత చరిత్రలు చెపుతున్నాయి. నిర్మాత గార్లె బుట్టలో పడ్డట్టే. ఆ ఆనందాన్ని 150 ఫీట్ల కటౌట్ తోనే అభిమాను లు పండగ చేసుకున్నారు. మన కథానాయకులు కొలీవుడ్ లో ఏమీ చేయలేక పోతున్నా కొలీవుడ్ హీరోలు తరచుగా మనవద్ద వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తూనే ఉన్నారు. దీనికి బాహుబలి మినహాయింపు. 



Image result for mersal heroines images



ముఖ్యంగా బుధవారం విడుదలైన ఈ సినిమాకు మంచి ఎడ్జ్ ఏమంటే తొలిరోజు ఫాన్స్ థియేటర్స్ నింపేయటం సహజం, పూర్తి పాజిటివ్ టాక్ రావటం ప్లస్ రెండవ రోజు అంటె నిన్న దీపావళి థియేటర్స్ ఫుల్ల్.  నేడు వీకెండ్ స్టార్ట్ అంటే నేడు (శుక్ర) రేపు (శని) ఎల్లుండి (ఆదివారం) కావటంతో- ఈ వీకెండ్ ఆ సినిమా వసూళ్ళు సూపర్గా ఉంటాయి అంటున్నారు. 


అంత అద్భుతమైన సినిమాను తెలుగులో చూడటానికి మరో వారం ఆగాల్సిందే. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్‌కి జోడీగా సమంత, కాజల్‌,  నిత్యామేనన్‌ నటించగా. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. అయితే మన తెలుగు హీరోలు కోలీవుడ్ దున్నేయటం వాయిదా పడగా (మహేష్ బాబు స్పైడర్ అట్టర్ కూడా ఫ్లాప్ అయింది కదా!) "అదిరింది"  అనే మెర్సల్ తో విజయ్ తెలుగులో కూడా దుమ్ము దులపడం అదరగొట్టవచ్చు. 


వివాదాల మెర్సల్



విజయ్‌ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా 'మెర్శల్‌'ను వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బెంగళూరులోని ఈ సినిమా థియేటర్లపై దాడులు జరిగాయి. తెలుగులో విడుదలకావాల్సి ఉన్నా.. వివాదాల కారణంగా రిలీజ్‌ కాలేదు. తమిళనాడు అంతటా విడుదలై.. భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమాను మరో వివాదం చుట్టుముట్టింది. సినిమాలో విజయ్‌ పలు రాజకీయ డైలాగ్‌లు పేల్చడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ), డిజిటల్‌ చెల్లింపులపై విజయ్‌ పేల్చిన డైలాగులు బీజేపీని అసంతృప్తికి గురిచేశాయి.


సినిమా నుంచి ఈ డైలాగులు వెంటనే తొలగించాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తమిళిసాయి సౌందర్‌రాజన్‌ డిమాండ్‌ చేశారు. విజయ్‌ రాజకీయ లక్ష్యాలు ఉండటంతోనే ఆయన సినిమాలో ఈ డైలాగులు పేల్చారని విమర్శించారు. 'మెర్సల్‌ సినిమాలోని పలు డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయి. జీఎస్టీ, డిజిటల్‌ ఇండియాను కించపరిచేలా ఉన్న డైలాగులను వెంటనే సినిమా నుంచి తొలగించాలి' అని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: