కృష్ణగాడు వీర ప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్ ఆ సినిమాతో హిట్ అందుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన మహానుభావుడుతో పాటుగా ఈ వారం రిలీజ్ అయిన రవితేజ రాజా ది గ్రేట్ కూడా హిట్ అందుకోవడంతో అమ్మడు హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ అయ్యింది. ఇక ఈ హ్యాట్రిక్ హిట్ జోష్ లో ఓ అదిరిపోయే ఛాన్స్ అందుకుంది మెహ్రీన్.


విక్టరీ వెంకటేష్ తేజ కాంబినేషన్ లో సినిమాకు హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ సెలెక్ట్ అయ్యిందట. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫాంలోకి వచ్చిన తేజ వెంకటేష్ తో సినిమాకు సిద్ధమయ్యాడు. సురేష్ బాబు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకీ సరసన అమ్మడు లక్కీ ఛాన్స్ పట్టేసింది. 


సీనియర్ హీరోల సరసన నటించడానికి హీరోయిన్స్ అంతగా ఇష్టపడరు. కాని మెహ్రీన్ మాత్రం వెంకటేష్ ఛాన్స్ రాగానే ఓకే అనేసిందట. హ్యాట్రిక్ హిట్లు కొట్టినా ఆమె అభినయంలో ఇంకా మెరుగులు దిద్దుకోవాల్సిందే. రాజా ది గ్రేట్ లో అయితే అమ్మడు మరీ లావుగా కనిపించింది. మరి ఇవి కాస్త సరిచూసుకుంటే ఇక్కడ కొన్నాళ్లు ఉండే అవకాశం ఉంటుంది.


ప్రస్తుతం అమ్మడు సాయి ధరం తేజ్ జవాన్ సినిమాలో నటించింది. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక సందీప్ కిషన్ కేర్ ఆఫ్ సూర్యలో కూడా ఆమె నటిస్తుంది. మొత్తానికి తెలుగులో మెహ్రీన్ అనుకున్న రేంజ్ అందుకుంది మరి ఇదే జోష్ కొనసాగించి ఇక్కడ స్టార్ ఇమేజ్ సంపాదిస్తుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: