ఈ మద్య చాలా మంది సినిమాలపై తమదైన శైలిలో రివ్యూలు రాస్తూ ఎన్నో కాంట్రవర్సీలకు గురి అవుతున్నారు.  ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో తన రివ్యూల విషయంలో కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్న కత్తి మహేష్ ని ఆ మద్య పలువురు సినీ హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా బాలీవుడ్ లో ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేంద్రబిందువుగా ఉంటున్న కమల్ ఆర్ ఖాన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  కొంత కాలంగా పనికట్టుకొని  సౌత్,  నార్త్ సినిమాలకి సంబంధించి నెగెటివ్ రివ్యూలు రాస్తూ బాగా పాపులర్ అయ్యాడు కమల్ ఆర్ ఖాన్ .
Image result for SECRET SUPER STAR  posters
సుల్తాన్ , బాహుబలి, సర్ధార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు ఇలా ఒకేటంటి పలు భారీ స్టార్ట్స్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి నెగెటివ్ రివ్యూలు రాశాడు.  ఇక మళియాల సూపర్ స్టార్ మోహన్ లాల్ పై పై నెగెటివ్ కామెంట్స్ చేసి విమర్శల పాలయ్యాడు. భారత్లో విడుదలవడానికి ముందే దుబాయ్లో సినిమా ప్రీమియర్ షో చూసేసి, చెత్త రివ్యూలు రాస్తాడనే టాక్.  బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ నటించిన  సీక్రెట్ సూపర్ స్టార్ రివ్యూ రాశాడు.
Image result for kamal r khan crying
సినిమా విడుదలకి ముందుగానే క్లైమాక్స్ కి సంబంధించి ఓ సమీక్ష రాసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఫైర్ అయిన అమీర్ అభిమానులు కమల్ ఖాన్ పై ఫిర్యాదు చేసి ట్విట్టర్ ఎకౌంట్ నిలిపివేశేలా చేశారు. దీనిపై స్పందించిన కమల్ ఆర్ ఖాన్.. తాను ఎంతో వెచ్చించి 6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నట్టు చెప్పాడు. నాలుగేళ్ళల్లో దీని కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టానని కూడా అన్నాడు.

దీనిపై కోర్టుకి వెళ్లి నేను ఖర్చు పెట్టిన డబ్బు నాకు తిరిగి వచ్చేలా చేయమని కోరతానని లేఖలో రాశాడు. అంతే కాదు  ఇక తాను మరో ఖాతా తెరవాలని అనుకోవడం లేదని చెబుతూ.. చివరిగా ట్విట్టర్ కి , అమీర్ ఖాన్ కి బెస్ట్ ఆఫ్ లక్ తెలిపాడు. ఇక నెటిజన్స్ .. కే ఆర్కే ట్విట్టర్ ఎకౌంట్ సస్పెండ్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ దీపావళికి మంచి గిఫ్ట్ ఇచ్చిందని ట్వీట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: