మాటల మాంత్రికుడు త్రివిక్రమ్-పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం ‘అజ్ఞాతవాసి’.  ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.  మొదట ఈ సినిమా టైటిల్స్ గోకుల కృష్ణుడు .. మాధవుడు , రాజు వచ్చినాడో అనే టైటిల్స్ పరిశీలనలోకి వచ్చాయి.  కానీ ‘అజ్ఞాతవాసి ’అనే టైటిల్ కి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది..కాకపోతే ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి దీపావళికి రిలీజ్ చేస్తారని ఆశలో ఉన్నారు. 
Image result for pawan trivikram
పవన్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్ తో పాటు మ్యూజికల్ వీడియో ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేసింది.  దీపావళికి ‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారనుకుంటే..అభిమానుల ఊహాగానాలని తలక్రిందులు చేస్తూ యూనిట్ ఓన్లీ శుభాకాంక్షలతో సరిపెడుతున్నట్లుగా ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది .
Image result for pawan 25 th posters
దీంతో అభిమానులకి మరోసారి నిరాశ తప్పలేదు. అయితే చిత్ర టైటిల్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.  ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్నాడు.
పవన్ ఫ్యాన్స్ కి మరోసారి నిరాశే ఎదురైంది
ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10, 2018న విడుదల కానున్న సంగతి తెలిసిందే.  



మరింత సమాచారం తెలుసుకోండి: