సూపర్ స్టార్ మహేష్ సినిమా హిట్ కొడితే ఆ కలక్షన్స్ మోత ఏ రేంజ్ లో ఉంటుందో ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం డిజాస్టర్ లలో కూడా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఎన్నో అంచనాలతో వచ్చిన స్పైడర్ మహేష్ ను కనీసం బయట కనిపించకుండా చేసిందంటే ఆ సినిమా మహేష్ ను ఎంతగా నిరాశ పరచిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే చేస్తున్న సినిమాల మీద ఏమాత్రం ఛాన్స్ తీసుకోవట్లేదు మహేష్.


మోహమాటానికి కూడా నచ్చని సీన్.. నచ్చని కథ ఇలా అన్నిటిలో మహేష్ కొత్తగా మార్పులు తెస్తున్నాడట. ఇక సినిమా అంటే హిట్ సెంటిమెంట్ కంపల్సరీ కాబట్టి చేస్తున్న భరత్ అను నేనుకి సెంటిమెంట్లు ఎక్కువయ్యాయట. శ్రీమంతుడు హిట్ ఇచ్చిన కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అను నేను సినిమాకు హిట్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.


అసలైతే సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ పెండింగ్ పడుతుంది కాబట్టి మళ్లీ సమ్మర్ కే గురి పెట్టాడట మహేష్. ఇక ఎలాగు సమ్మర్ రిలీజ్ కాబట్టి మహేష్ తనకు కలిసి వచ్చిన ఏప్రిల్ లోనే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. ఏప్రిల్ 28న రిలీజ్ అయిన పోకిరి మహేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ తో ఏప్రిల్ 20న భరత్ అను నేను రిలీజ్ ఫిక్స్ చేశారట. 2018 సమ్మర్ మహేష్ తన సినిమా కన్ఫాం చేశాడన్నమాట.  


స్పైడర్ తర్వాత మహేష్ సినిమాపైన మరింత ఫోకస్ పెట్టాడు. భరత్ అను నేను పూర్తి చేసి ఆ వెంటనే వంశీ పైడిపల్లి సినిమా షురూ చేస్తున్నాడు మహేష్. మరి ఈ రెండు సినిమాలతో సూపర్ స్టార్ తన స్టార్ రేంజ్ ఏంటన్నది చూపిస్తాడేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: