దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యాచారాలకు సంబంధించిన వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.  ఒకప్పుడు భారత దేశంలో మహిళలంటే ఎంతో గౌరవించే వారని..కానీ ఎప్పుడైతే సెల్ ఫోన్ కల్చర్ పెరిగిపోతూ వస్తుందో..ముఖ్యంగా యువత ఫోర్న్ సైట్స్ కి అలవాటు పడ్డారో దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఈ లైంగిక వేధింపులు సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు. 
Image result for priyanka chopra quantico
ఇప్పటికే పలువురు హీరోయిన్లు వీటిపై తమ గళం వినిపించారు. తాజాగా మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై బాలీవుడ్ అగ్రతార ప్రియాంకా చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. పనిచేస్తున్న చోట్ల మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్న మాట వాస్తవమేనని పేర్కొంది.  ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఈ మాజీ ప్రపంచ సుందరి.. ఇటీవల హాలీవుడ్‌ను కుదిపేసిన ప్రొడ్యూసర్ హార్వే వెయిన్‌స్టైయిన్‌ వికృత చర్యలపై తీవ్రంగా స్పందించింది.
Image result for priyanka chopra quantico
ఒక మహిళను అత్యంత సులభంగా లోబరుచుకోగలిగేది వాళ్లు పనిచేస్తున్న చోటనుంచే.. కనీసం ఏ డ్రెస్ వేసుకోవాలనే దానిపై కూడా మహిళలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మహిళగా పుట్టడమే శాపమని భావిస్తున్నారు. 
Image result for bhavana rape case
ఇలా భావించడం వల్లే మహిళలు చాలా విషయాల్లో వెనుకంజలో ఉన్నారని.. తమకు జరిగిన అన్యాయంపై ధైర్యంగా పోరాడినపుడే తమకు సరైన న్యాయం లభిస్తుందని అన్నారు.  గతంలో మళియాళ నటి భావన తనపై జరిగిన లైంగిక వేధింపు జరిపిన వారిపై న్యాయపోరాటం చేసి వారికి జైలు శిక్ష పడేలా చేసింది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: