తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన రవితేజ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇడియట్’ చిత్రంలో హీరోగా నటించాడు.  తర్వాత వచ్చిన  సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి.మాస్ ఎలిమెంట్స్ తో ఉన్న చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రవితేజ అప్పటి నుంచి మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ నిర్మాణ సారథ్యంలో..దిల్ రాజు నిర్మాతగా, అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించారు.
Image result for raja the great stills
దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మంచి హిట్ కొట్టాలన్న తపనతో ఉన్న రవితేజకు ఈ సినిమా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి.  సినిమా దర్శకుడు రాజా ది గ్రేట్ మొత్తం ఎంటర్టైనర్ మోడ్ లో తీర్చిదిద్దాడు. లాజిక్ లు ఏమి పట్టించుకోకుంటే సినిమా బాగానే తీశాడు.
Image result for raja the great stills
రాజా ది గ్రేట్ లో మరోసారి తన ఎనర్జీ లెవల్స్ చూపించాడు రవితేజ. అంధునిగా తన యాక్టింగ్ బాగుంది. మెహ్రరీన్ అందాలు..కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పాత్ర నవ్వులు పండించింది. రాధిక, రాజేంద్ర ప్రసాద్ ల పాత్ర ఆకట్టుకుంది.  మొత్తానికి దీపావళి పండుగ సందర్భంగా మాస్ మహరాజ సూపర్ హిట్ కొట్టాడు.
 
ఈ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్లు:


నైజాం 3 కోట్ల 81 లక్షలు 
సీడెడ్ 1.60 లక్షలు 
ఉత్తరాంధ్ర 1.07 లక్షలు 
గుంటూరు 79.10 లక్షలు 
ఈస్ట్ గోదావరి 67.84 లక్షలు
కృష్ణా 63.52 లక్షలు
వెస్ట్ గోదావరి 54.24 లక్షలు 
నెల్లూరు 31 లక్షలు 
టోటల్ ఆంధ్ర - తెలంగాణ 9. 44 కోట్లు 
ఓవర్సేస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి షేర్ 12 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: