తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది నటీ నటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఇదే వరసులో చేరారు అక్కినేని నాగ చైతన్య, సమంత.  గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మాయ చేసావే’ చిత్రం షూటింగ్ సమయంలో ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు.  ఆ తర్వాత కొంత కాలంగ ప్రేమించుకున్న ఈ జంట ‘మనం’ చిత్రం తర్వాత పెద్దల ఆశిస్సులు తీసుకొని అక్టోబర్ 6న హిందూ సంప్రదాయం లో అక్టోబర్ 7న క్రిస్టియన్ పద్దతిలో రెండు సంప్రదాయాల్లో జరిగిన సంగతి తెలిసిందే. 
చెన్నైలో చైతూ-సమ్మూ రిసెప్షన్..!
ఇక  'రాజుగారి గది 2' ప్రమోషన్‌లో భాగంగ సమంత కొన్ని విషయాలు మీడియాతో షేర్ చేసుకుంది.   తాను నటించిన మొదటి చిత్రం ‘ఏం మాయ చేశావే’ సూపర్ హిట్ అయ్యింది.  అప్పట్లో నాగ చైతన్య-సమంత మొదటి సినిమా 'ఏ మాయ చేసావే' 50 రోజుల వేడుకని చిత్రయూనిట్ ఘనంగా జరిపింది. ఆ వేడుకకి అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా హాజరయ్యారు.
Image result for samantha nageswara rao
కాగా ఆ వేడుకలో అక్కినేని నాగేశ్వర్ రావు సమంతకి ఒక మంచి కంప్లిమెంట్ ఇచ్చారట. నాగ చైతన్యకి 49% మార్కులు వేస్తే సమంతకు మాత్రం 51% మార్కులు ఇచ్చారట. తన రూపురేఖలు..నటన అచ్చం మహానటి సావిత్రిని పోలి ఉన్నాయని అన్నారు. 
Related image
ఆమె కళ్లు ఒక్కటే కాదు ఆమె స్కిన్ టోన్ కూడా సావిత్రి మాదిరిగానే హావభావాలను పలికిస్తోందని చెప్పారట.  అంత గొప్ప నటుడు ఆ మాట అనడంతో నాకు ఎక్కడలేని సంతోషం కలిగింది.  అప్పుడు ఆ వేడుకలో నాగార్జున, నాగ చైతన్యతో పాటు సమంత కూడా ఉన్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: