తెలుగు సినిమా  ప్రేక్షకులకి  తమిళ సినిమా హీరోలని కూడా ఆదరించడం మామూలే .. ఎన్నో సంవత్సరాల నుంచీ రజినీకాంత్, కమల్ హాసన్, విక్రం, సూర్య, కార్తి లాంటి వారు తమ సినిమాలని తమిళం తో పాటు తెలుగు లో కూడా విడుదల చేస్తున్నారు.

వారికి రెస్పాన్స్ కూడా అంతే బాగా వస్తుంది. మొదటి నుంచీ సరైన కంటెంట్ తో వచ్చే హీరోలు కావడం తో తెలుగు ప్రేక్షకులు కూడా ఏ భాషా చిత్రమైనా ఒకటే అని ఆదరిస్తూ వస్తున్నారు.

అందుకే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి ఫెవేరేట్ తమిళ్ హీరో - కార్తి. యుగానికి ఒక్కడు లాంటి సినిమాతో అరంగేట్రం చేసి ఊపిరి లాంటి ద్విభాషా చిత్రం ఇచ్చాడు కార్తి. ఇప్పుడు తమిళ సినిమా  'ధీరమ్ అధిగారమ్ ఒండ్రు' సినిమాకి .. తెలుగులో 'ఖాకీ' పేరును ఖరారు చేశారు.

రెండు భాషల్లోను ఈ సినిమాను నవంబర్ 17వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రకుల్ కనిపించనుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఒక ప్రాంతం లో పదేళ్ళ కాలం లో జరిగిన హత్యలని చేధించే క్యారెక్టర్ చేస్తున్నాడు కార్తి. ఈ సినిమా తనకి హిట్ ను ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడు.  ట్రైలర్ - సాంగ్స్ కూడా చాలా పాజిటివ్ గా వెళుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: