సమంత అతి చురుకైన నటీమణి. అక్కినేని నాగార్జున ఇంటికోడలు నాగార్జునలాగే దూసుకుపోగలదు. ప్రేమించిన నాగ చైతన్యను పెళ్లి చేసుకోవడం, వివాహం తర్వాత విడుదలైన "రాజు గారి గది 2" మామతో కలసి పోటీపడి నటించి విజయం సాధించడంతో హీరోయిన్ సమంత చాలా సంతోషంగా ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంది. అంతా అన్నింటా ఆనందమే. అయినా ఏమూలో కొంత నిరుత్సాహం.


Image result for samanta & savitri anr comment 


అదేమంటే మాత్రం, అక్కినేని నాగేశ్వరరావు గారు మొట్ట మొదటి సారి తన కిచ్చిన కితాబును నిజం చేయలేక పోతున్నందు కు ఫీలవుతోందట. ఈ విషయం తాజాగా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతోంది. అక్కినేని ఇంటి కోడలిగా తన బాధ్యతను నూరు పాళ్ళు నిర్వహిస్తానని చెబుతున్న సమంత అక్కినేని అసలు విషయంలోకి వస్తే, తన మొదటి సినిమా "ఏ మాయ చేసావె" చూసిన తమ తాతగారు అక్కినేని నాగేశ్వరరావుగారు తన నటనకు, చైతూ నటనకు మార్కులు ఇచ్చారని, అందులో 2 మార్కులు తనకే ఎక్కువ వచ్చాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది సమంత.


Related image 


అంతేకాదు 2 మార్కులు ఎక్కువ ఇవ్వడమే కాకుండా తనని "మహానటి సావిత్రి" గారితో సరి పోల్చారని, నా కళ్లు కూడా ఆ మహానటి కళ్ళవలే వలే అద్భుత హవభావాలను పలికిస్తాయనే గొప్ప కాంప్లిమెంట్‌ని ఆయన నుండి అందుకున్నానని తెలి పింది. జగ్ద్విఖ్యాత నటులైన నాగేశ్వరరావుగారి నుండి ఇంత గొప్ప కాంప్లిమెంట్‌ అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నా నని తెలిపిన సమంత అక్కినేని, జీవితంలో ఆ కాంప్లిమెంట్స్ ను మరిచిపోలేనని, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని తెలిపింది.


Related image

 

మరి అంత గొప్ప నటుడి నుంచి అచ్చం సావిత్రిలానే ఉన్నావని అనిపించుకున్న సమంత, ప్రస్తుతం చేస్తోన్న "మహానటి" చిత్రంలో మాత్రం సావిత్రిగా నటించే అవకాశం మాత్రం దక్కించు కోలేకపోయినందుకు చాలా ఫీలైంది. ఆ పాత్రను టాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలు మాత్రమే చేసిన కీర్తి సురేష్ చేస్తున్న విషయం తెలిసిందే. సావిత్రి పాత్రని తను చేయలేకపోతున్నానే అనే విషయంలోనే మాత్రం సమంత ఫీల్ అవుతున్నట్లుగా అనిపిస్తోందని, ఈ ఇంటర్వ్యూ చూసిన  నెటిజన్లు అనుకుంటుండటం విశేషం.

 Image result for samanta & savitri anr comment


అయితే ఒక మాట మహానటి సినిమాలో నటించలేకపోయినా, సావిత్రి తన నటనలో చూపిన ప్రతిభ పాఠవాలను చూపినా, ఆ గౌరవం సమంతకు దక్కుతుంది.  కొన్ని సినిమాల్లో అయినా  ఆ స్థాయిలో నటించినా ఆ కోరిక తీరవచ్చు.   సమంత అక్కినేని తమ తాతగారు అక్కినేని కోరిక తీర్చగలరని ఆశిద్ధాం. 


Image result for akkineni nageswara rao samanta

మరింత సమాచారం తెలుసుకోండి: