మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా బివిఎస్ రవి డైరక్షన్ లో వస్తున్న సినిమా జవాన్. కృష్ణ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నట్టు తెలిసిందే. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ 1న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అప్పుడు పోస్ట్ పోన్ అయ్యింది.


ఇక నవంబర్ 3 రిలీజ్ అంటూ నిన్న మొన్నటిదాకా హంగామా చేయగా ఇప్పుడు ఏకంగా డిసెంబర్ కు సినిమా రిలీజ్ వాయిదా వేశారు. డిసెంబర్ 1న సాయి ధరం తేజ్ జవాన్ రిలీజ్ కాబోతుందట. ఈ డేట్ మాత్రం ఫిక్స్ అంటున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలో కొన్ని రీషూట్స్ జరిగాయని తెలుస్తుండగా తేజ్ కు తేడా కొట్టేయడంతో ఈ సినిమా గురించి పట్టించుకోవడం మానేశాడని అంటున్నారు.


తిక్క, విన్నర్ ఫ్లాపులే కాదు గెస్ట్ రోల్ చేసిన నక్షత్రం సినిమా కూడా ఫ్లాప్ అవడంతో డీలా పడగా జవాన్ మీదే అన్ని ఆశలు పెట్టుకున్నాడు సాయి ధరం తేజ్. ఇక ఈ సినిమా రిజల్ట్ మీద ఫోకస్ పెట్టిన తేజ్ హిట్ సినిమాకు కావాల్సిన విషయం ఉండేలా చేసుకున్నాడు. లక్కీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ హ్యాట్రిక్ హిట్ జోష్ లో ఉండగా ఈ సినిమా ఆమెకు అసలైన పరిక్ష అంటున్నారు.     


ఇన్నాళ్లు రిలీజ్ సంక్షోభంలో ఉన్న జవాన్ ఎట్టకేలకు రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా అంచనాలను అందుకుంటే మెగా మేనళ్లుడి ఆశ నెరవేరినట్టే. మెగా ఫ్యాన్స్ లో అతి తక్కువ కాలంలోనే ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న తేజ్ ఈసారి హిట్ టార్గెట్ తో వస్తున్నాడు. మరి సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.     



మరింత సమాచారం తెలుసుకోండి: