హీరో పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రం pspk25 ఎంత త్వరగా పూర్తి చేసి ప్రజా క్షేత్రం లో అడుగు పెట్టి రానున్న ఎన్నికల కోసం తన జనసేన పార్టీ నీ తన పార్టీ జనాలనీ సిద్ధం చేద్దామా అని చూస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో సాగుతున్న ఈ చిత్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ కానిస్తున్నాడు.

ఈ పరిస్థితి లో పవన్ షూటింగ్ లలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు అయినా లెక్కజేయడం లేదు సాధారణంగా ఎక్కడైనా షూటింగ్ లో చిన్నా చితకా గాలివాన వచ్చినా షూటింగ్ ఆపేసి తరవాత రోజు పెట్టుకుంటారు ఎందుకంటే క్వాలిటీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కానీ పవన్ మాత్రం ఈ సినిమా షూటింగ్ ని మొన్న ఒక రోజు కాస్తంత వర్షం వచ్చినా అలాగే సీన్ లు చిత్రీకరణ చేసాడట.

అయితే పవన్ కళ్యాణ్ ప్రకృతినే కాక తన దెబ్బలని కూడా లెక్క చేయకపోవడం కంగారు పెట్టిస్తోంది. రీసెంట్ గా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ చేతికి గాయం తగలడం అతని పాత్ర వరకూ ఒక పూట పక్కన పెట్టి వేరేవారి సీన్ లు చిత్రీకరణ చెయ్యడం మొదలు పెట్టారు. అయితే ఇది జరిగిన రెండు రోజులకే పవన్ చేతికి ఫైట్ లో మళ్ళీ గాయం అయిందట.

ఈ గాయం కూడా చిన్నదేనని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి. తమ అభిమాన హీరోకు స్వల్ప గాయమే అయిందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, చిత్ర షూటింగ్ నిరంతరాయంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: