జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన జై లవ కుశ సంచలనాలు సృష్టించింది. బాబి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తారక్ స్టామినాను ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమా చేయడానికి ముందు అనీల్ రావిపుడి తారక్ కు ఓ కథ వినిపించాడని వార్తలు వచ్చాయి. అయితే అదే కథతో రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా చేశాడని అంటున్నారు.


మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ కేవలం రాజా అంధుడు అన్న పాయింట్ తప్ప మిగతా అంతా రొటీన్ డ్రామానే అనిపించింది. అసలు మనోడు అంధుడిగా ఉండి వినాయకుడి బొమ్మ గీయించడం.. ట్రైన్ ఎక్కడం లాంటివి అసలు లాజిక్ అనిపించవు. అయితే ఈ సినిమా కథనే ఎన్.టి.ఆర్ కు చెప్పాడట అనీల్ రావిపుడి.


తారక్ అటు ఇటుగా కథను మార్చి చేసే ఆలోచన చేద్దామనుకున్నాడట. మళ్లీ ఎందుకో డౌట్ వచ్చి కాదనుకుని జై లవ కుశ చేశాడు. ఒకవేళ తారక్ ఈ సినిమా చేసుంటే వరకు కచ్చితంగా నిరాశ కలిగేది. జై లవ కుశలో జై పాత్ర నిజంగానే గొప్పగా అనిపించింది. అంధుడిగా తారక్ ను అసలు ఊహించలేరు అభిమానులు.


రవితేజ మాత్రం అనీల్ మీద పెట్టిన నమ్మకం ఒమ్ము కాలేదు. సినిమా మాత్రం రవితేజకు మంచి హిట్ అందించింది. బెంగాల్ టైగర్ తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మరి వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా మరోసారి రవితేజ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: