మిస్సమ్మ , విరోధి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తు ఉండిపోయే డైరెక్టర్ నీలకంట. ఆ డైరెక్టర్ ప్రస్తుతం హిందీ లో సూపర్ హిట్ అయిన క్వీన్ సినిమాని తెలుగు లో రీమేక్ చెయ్యడం లో బిజీ అయ్యాడు. ఇప్పటి వరకూ రీమేక్ లు చెయ్యని ఈయన మొట్టమొదటి సారి ఆ సినిమా కంటెంట్ నచ్చి రీమేక్ కి సిద్దం అయ్యారు.

ఒరిజినల్ కథని అలాగే తెరకి ఎక్కిస్తారా లేక నీలకంట తన టాలెంట్ ని ఇందులో ఇనుమడింప చేస్తారా అని అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి ప్రేక్షకులకి. హిందీ లో కంగన హీరోయిన్ గా చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టడం తో పాటు అవార్డుల విషయం లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంది.

తెలుగు నేటివిటీ లో ఈ సినిమా యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అంటూ ఒక ఇంటర్వ్యూ లో ఆన్సర్ చేసిన నీలకంట తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా కనక్ట్ అవుతారు అంటున్నారు " ఈ సినిమా హిందీ లో నేను చూసినప్పుడు బాగా కనక్ట్ అయ్యాను, తెలుగు లో రీమేక్ చేసే వర్త్ ఉన్న సబ్జెక్ట్ అని నేను అనుకున్నాను కానీ ఎవరు అంత రిస్క్ తీసుకుని రైట్స్ కొంటారు లే అని ఊరుకున్నాను.

చివరికి ఈ చిత్రం అటూ ఇటూ తిరిగి చివరికి నా దగ్గరకే రావడం నాకు ఫుల్ హ్యాపీగా ఉంది. నిజానికి నాకు రీమేక్ లు చేయడం నచ్చదు. కానీ హిందీ 'క్వీన్' చూసినప్పుడు మాత్రం ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనిపించింది" అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: