బ్లాక్ బస్టర్ అనే దానికే కొత్త నిర్వచనం చెప్పిన హిట్ ‘బాహుబలి’ తో తిరుగులేని క్రేజ్‌ ను స్వంతం చేసుకున్న స్టార్ హీరో ప్రభాస్. ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ఆధునిక నటసార్వభౌముడు నేడు తన బర్త్‌డేను జరుపు కోబోతున్నాడు. ఈ నేపథ్యంలో అతని సినిమాలు, బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి ప్రస్తుతం పలు వార్తలు వినిపిస్తున్నాయి.



నేడు, ప్రభాస్ 38 యేళ్ళ వయసు లోకి అడుగు పెట్టబోతున్నాడు. తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు ఈ పుట్టిన రోజు అతడికి వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే బాహుబలి-2  లాంటి చారిత్రక విజయం తర్వాత ప్రభాస్ జరుపు కోబోతున్న తొలి జన్మదినం కాబట్టి. అందుకే ఈసారి ప్రభాస్ పుట్టిన రోజును వారం రోజుల పాటు సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు అతడి ఫ్యాన్స్. ఈ వారానికి  "ప్రభాస్ జన్మదిన వారోత్సవం" గా,  వారం రోజుల పాటు పండుగలు చేయ బోతు న్నారు.  "ప్రభాస్ బర్త్ డే వీక్" అని పేరు కూడా పెట్టేశారు.


Image result for happy birthday prabhas darling


ప్రభాస్ పుట్టిన ఈ రోజున ‘సాహో’ ఫస్ట్‌లుక్ విడుదలవుతుందట. మూవీకి సంబంధించిన టీజర్ ఇప్పటికే విడు దలైంది. అది కూడా సినిమా సెట్స్‌పైకి రాక ముందు తయారు చేసిన టీజర్. ఇప్పుడు మూవీ సెట్స్‌పైకి వచ్చింది. కాబట్టి ప్రభాస్ ఈ  పుట్టిన రోజు సందర్భంగా నేడు, ‘సాహో’ ఫస్ట్‌లుక్ రిలీజయ్యే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.


ఇక ‘సాహో’ తర్వాత, దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ తో సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాను అతని బర్త్‌డే సందర్భంగా నేడు అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. ఈ మధ్య పవన్‌ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించి థీమ్ పోస్టర్‌ ను విడుదల చేశారు. అదేవిధంగా రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్‌ తో ఒక  "థీమ్ పోస్టర్‌" ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. తాను ఖచ్చితంగా  హిందీ సినిమా చేస్తానని ఇటీవల ఈ స్టార్ హీరో అన్నాడు. ప్రభాస్ పుట్టినరోజు నాడు బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్ కరణ్‌ జోహార్ కూడా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి.


Related image


ఈ విశ్వవిఖ్యాత టాలీవుడ్ కథానాయకుడు ప్రభాస్ ప్రముఖ సినీ నిర్మాత యు.సూర్యనారాయణ రాజు ముద్దుల కొడుకు. మహానటుడు కృష్ణం రాజు ప్రభాస్ పెదనాన్న అన్నది అందరికి తెలిసిన విషయమే. 2002 లో సినీ రంగం లో ఈశ్వర్ సినిమాతో ప్రవేసించి ఇప్పటికి 15 సంవత్సరాల సినీ జీవితం లో 20 సినిమాల్లో నటించాడు. వర్షం, చత్రపతి, చక్రం, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి ది బిగినింగ్ & బాహుబలి ది కంక్లూజన్ సినిమాలు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి. 'బాహుబలి ది కంక్లూజన్ దేశ వ్యాప్తంగా అనేక బాషల్లో విడుదలై పది రోజుల్లోనే 1000 కోట్ల రూపాయిలు కలక్షన్లు రాబట్టిన మెదటి భారతీయ సినిమాగా గుర్తించబడింది. ఈ సినిమా ప్రపంచములోనే అత్యధిక కలక్షన్లు సాధించిన రెండవ భారతీయ సినిమా 'బాహుబలి ది కంక్లూజన్. (దంగల్ తొలి స్థానం లో ఉంది) ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో ప్రభాస్ విగ్రహ ప్రతిస్థాపన కూడా ఒక అద్భుతమే. 


Image result for happy birthday prabhas darling


ప్రభాస్ కి హంగులూ ఆర్భాటాలు నచ్చవు. వాటికి ఆయన చాలా దూరంగా ఉంటాడు. కానీ ఈ సారి మాత్రం ఆయన పుట్టినరోజు వేడుక కాస్త సందడిగానే జరిగేలా కని పిస్తోంది. ఈ  రోజున 'సాహో' సినిమా నుంచి ఫస్ట్-లుక్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఈ పుట్టినరోజున, ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ప్రకటన కూడా వుండొచ్చుననే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ పుట్టినరోజు ప్రభాస్ అభిమానులకు పండుగ రోజు కానుందనే అనిపిస్తోంది. 


దేశంలోని అందాల భామలంతా ప్రభాస్.... ప్రభాస్ అంటూ కలవరిస్తున్నారు.  బాహుబలితో రెబల్ స్టార్ అంతర్జాతీయనటుడు అయిపోయాడు. ఈ హీరో ఇప్పుడు ఏవైనా సినిమాలు చేస్తున్నారంటే అది భారీ చిత్రమే అయి ఉంటుంది. నిర్మాతలు కూడా భారీగా పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్ముతున్నారు. అందుకే "సాహో" చిత్రానికి రూ.150 కోట్లు వెచ్చిస్తున్నారు.


Related image


ఈ కథానాయకుడి సరసన నటిస్తే చాలు అంటోంది బాలీవుడ్ అందాల తార ఆలియా భట్.  ప్రభాస్‌తో నటించే ఛాన్స్‌ వస్తే అసలు వదులుకోబోనని చెప్పింది అలియా భట్‌. దక్షిణాది నటుల్లో ప్రభాస్‌ అంటే తనకు చాలా ఇష్టమని మనసులో మాట చెప్పింది.


మరోవైపు దాదాపు ఎనిమిదేళ్లు ప్రభాస్ తో సినిమాల్లో నటించిన "మోస్ట్ ఇంటిమేట్ ఫ్రెండ్"  స్వీటీ అనుష్క, నేటి టాలీవుడ్ హాట్-కేక్  రకుల్ ప్రీత్ సింగ్, తెలుగు వారి చందమామ కాజల్, మిల్కి తమన్నా, బ్యూటీ క్వీన్ రాయ్ లక్ష్మీ, అందాల బాలీవుడ్ రాణిపద్మిని..... దీపికా పదుకునే లు ఇదే మాట చెప్పారు.


Related image


ఆ జాబితా లో చేరింది తమిళ స్టార్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ. తమిళంలో హీరోయిన్‌గా కొనసాగుతోంది వరలక్ష్మి. "శక్తి" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానుంది. "ప్రభాస్‌తో కలిసి నటిస్తారా?" అని చాలామంది అడుగు తున్నారు. ఆయన తో నటించాలని అందరూ అనుకుంటారు. ఆ అవకాశం వస్తే ఏ హీరోయిన్‌ మాత్రం వదులు కుంటుంది. అందుకు నేనేమీ మినహాయింపు కాదని చెప్పింది. బాహుబలి సినిమాలో ప్రభాస్‌ నటన అద్భుతం. నాకు చాలా బాగా నచ్చింది. 


Related image


బాలీవుడ్‌తోపాటు పలు భాషల్లో సినీ ప్రముఖుల దృష్టి యంగ్ రెబల్ ‌స్టార్‌ పై పడింది. ప్రభాస్‌తో ఒక్క సినిమాలోనైనా నటింప చేయాలనే సినీ నిర్మాతల “క్యూ”  భారీగానే పెరిగింది.  బాలీవుడ్ నుంచి వెల్లువలా ఆఫర్లు వచ్చి పడ్డాయి ప్రభాస్ కు అయినా  స్థైర్యం చెక్కు చెదరనీయలేదు. ఆఫర్ల వెంట పడి పరుగెత్తలేదు.అలాగే కోట్లు క్రుమ్మ రించనున్న ప్రచార చిత్రాలకు కూడా స్పందించలేదు. 

Image result for prabhas engagement with priyanka photos


ఇంత మంచి శుభ సంకేతాలతో శకునాలతో ప్రారంభమయ్యే మీ జన్మదినానికి ఆహ్వానం తెలుపుతూ  "ఇండియా హెరాల్ద్ బృందం" మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: