ఈనెల 27న తెలుగులో విడుదల అవనున్న "అదిరింది" సినిమా తమిళ మాత్రుక "మెర్సల్" వసూళ్ళ రికార్డులను బ్రద్దలు చేస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకే సాధ్య మైన "వంద కోట్ల క్లబ్" ఇప్పుడు సౌత్ సినిమాలకు కూడా సాధారణమై పోయింది. మూడు రోజుల్లో వంద కోట్లు, ఐదు రోజుల్లో వంద కోట్లు, పది రోజుల్లో వంద కోట్లు అని చెప్పు కునేవాళ్లు. ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు విడుదలవగానే - పాజిటివ్ టాక్ వస్తే వంద కోట్ల క్లబ్బులో చేరడం మామూలు విషయంగా మారిపోయింది.

Related image


దీపావళి కానుకగా విడుదలైన ఈ తమిళ సినిమా విడుదలైన నాటి నుండీ తీవ్ర వివాదాలతో చర్చనీయాంశం అవుతోంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లకైతే పాసిటివ్ టాక్ తో సమానమే. కొన్ని వివాదాలు ఈ చిత్రానికి మంచి మైలేజీ పబ్లిసిటీ రూపంలో వచ్చింది. కలెక్షన్లు కూడా నిలకడగా సాగిపోతున్నాయి. తొలి వీకెండ్ గడవక ముందే, అంటే శనివారానికే 100 కోట్ల రూపాయిల వర్షం కురిపించింది.  


మహేష్ బాబు సినిమా "స్పైడర్" నెగెటివ్ టాక్ తెచ్చుకుని కూడా వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది. ఇక కొంచెం డివైడ్‌ టాక్‌తో మొదలైన ఇళయదళపతి, విజయ్ సినిమా "మెర్సల్"  కేవలం నాలుగే నాలుగు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. తెలుగు వెర్షన్ "అదిరింది" రిలీజ్ కాకున్నా ఇంత వేగంగా వంద కోట్ల గ్రాస్ దాటేయటం  ఆశ్చర్యం కలిగించే విషయమే.

Image result for mersal hd


విజయ్‌ కెరీర్లో ఇది ఐదో వందకోట్ల సినిమా కావడం విశేషం. ఇంతకు ముందు తుపాకి, కత్తి, తెరి, భైరవ సినిమాలు కూడా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశాయి. ‘మెర్సల్’ కు టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. కొన్ని వివాదాలు కూడా ఈ సినిమాకు బాగానే కలిసొచ్చాయి. ముఖ్యంగా "జీఎస్టీ, పెద్ద నొట్ల రద్ధు" వంటి కేంద్ర ప్రభుత్వ విషయాలపై విజయ్ ఈ సినిమాలో చలోక్తులు విసరటం, దానిపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం, కొన్ని డైలాగులు తీసేసే వరకు పరిస్థితి వెళ్లడంతో ఈ సినిమాపై పెద్ద చర్చే నడిచింది. 

మరోవైపు వైద్యుల గురించి, కార్పొరేట్ హాస్పిటళ్ల గురించి ఇందులో చలోక్తులు, సెటైర్లు వేయడం ఆ వర్గాలకు ఆగ్రహం తెప్పించింది.తమిళనాడు వైద్యులు "మెర్సల్" పైరసీని వ్యాప్తి చేసే ప్రయత్నంలో ఉన్నట్లు, లీగల్ చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ రెండు వివాదాలపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకూ ఎవరూ స్పందించలేదు. ఐతే ఈ చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ దీనిపై స్పందించారు.



ఈ సినిమాలో డైలాగుల్ని ఆయన సమర్థించారు. ఇలా ప్రశ్నించడం అవసరం అని ఆయన అన్నారు. తమిళనాట ఈ సినిమాకు వ్యతిరేకంగా వైద్యులు తీర్మానాలు చేయాలనే ఆలోచన లో ఉన్నట్లు తెలిసిందని, ఐతే వాళ్ల వ్యతిరేకతే తమ సినిమాకు ప్రచారంలో పెద్ద మైలేజ్ అవుతోందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. తాము చెప్పింది తప్పు కాదని, ఇలా ప్రశ్నించే సినిమాలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

సింగపూర్లో 8 శాతం జీఎస్టీ ఉందని, కానీ అక్కడ అందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందుతోందని ఆయన అన్నారు. మన దగ్గర పూర్తి భిన్నమైన పరిస్థితులు న్నాయని, 28%  జీఎస్టీ కడుతున్నామని, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి గురవుతున్నామని విజయేంద్ర అన్నారు. పన్నులు చెల్లిస్తున్నా సరైన వైద్యం అందట్లేదన్నారు. ఈ విషయాల్నే తమ సినిమాలో చూపించినట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

Related image


తమిళ  'మెర్సల్' తో పాటుగా,  దీని తెలుగు వెర్షన్ 'అదిరింది' కూడా విడుదల కావాల్సింది. కానీ ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడిపోయింది. అయినప్పటికీ తమిళ వెర్షన్ అంచనాల్ని మించి వసూళ్లు సాధించింది. ‘మెర్సల్’ తెలుగు వెర్షన్ "అదిరింది" వారం రోజులు ఆలస్యంగా, ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం కొస మెరుపు ఒక విశేషంగా చెపుతున్నారు. 


Image result for nitya menon in mersal

మరింత సమాచారం తెలుసుకోండి: