భారత దేశంలో సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది మధుర గాయనీ, గాయకులు వచ్చారు.  అయితే దక్షిణాదితోపాటు 17 భాషల్లో 48 వేలకు పైగా పాటలను ఆలపించిన సుమధుర గాయని  గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 65 ఏళ్ల క్రితం మైసూరులో పాటలు పాడటం ప్రారంభించానని... తన చివరి కచేరిని కూడా అక్కడే ఇచ్చి, విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. 
Image result for s janaki rare photos
 1957లో విద్యని విలయట్టు అనే తమిళ సినిమాతో గాయనిగా కెరీర్ ప్రారంభించిన జానకమ్మ, ఎంఎల్ఏ చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేశారు. గాయనిగా మారిన తొలి ఏడాదిలోనే ఆరు భాషల్లో పాటలు పాడి మెప్పించారు.  ఈ నెల 28న మానసగంగోత్రి మైదానంలో తన చివరి కచేరి జరుగుతుందని ఆమె తెలిపారు. నాలుగు జాతీయ అవార్డులను, వివిధ రాష్ట్రాలకు చెందిన 33 సినిమా అవార్డులను సొంతం ఆమె చేసుకున్నారు.
Image result for s janaki rare photos
అయితే 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డుకు ఎంపికచేస్తే దానిని తిరస్కరించారు.  తెలుగు, తమిళ, మళియాళ, కన్నడలతో పాటలే కాదు అరబిక్, జపనీస్, జర్మన్, లాటిన్ భాషల్లోనూ తన గానంతో అలరించారు. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మాణంలో వచ్చిన మౌనపోరాటం సినిమాకు సంగీత దర్శకత్వం వహించి తనలో ఈ టాలెంట్ కూడా ఉందని నిరూపించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: